News February 8, 2025
VKB: ‘స్థానిక’ ఎన్నికలు.. కాంగ్రెస్, BRS, BJP మంతనాలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738997853091_718-normal-WIFI.webp)
ఈ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దీంతో వికారాబాద్ జిల్లాలోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల సందడి నెలకొంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష BRS, BJPకి చెందిన ఆశావహులు మంతనాలు జరుపుతున్నారు. తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని గ్రామాల్లోని కొందరు ఆయా పార్టీల ముఖ్యులను కోరుతున్నారు. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల వాతావరణం మొదలైంది.
Similar News
News February 8, 2025
భారత జట్టుకు గుడ్‌న్యూస్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739016893366_81-normal-WIFI.webp)
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేకు మోకాలి నొప్పి కారణంగా దూరమైన భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రెండో వన్డేలో ఆడనున్నారు. కోహ్లీ ఫిట్‌గానే ఉన్నాడని, రెండో వన్డేకు అతడు సిద్ధమని భారత జట్టు బ్యాటింగ్ కోచ్ వెల్లడించారు. దీంతో కోహ్లీ కోసం జైస్వాల్‌ను తప్పిస్తారా? లేక శ్రేయస్ అయ్యర్‌ను పక్కనబెడతారా? అనేది తెలియాల్సి ఉంది. రేపు కటక్ వేదికగా మ.1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
News February 8, 2025
తైక్వాండో నేషనల్‌లో మెరిసిన భద్రాద్రి జిల్లా అమ్మాయి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739013063122_52061807-normal-WIFI.webp)
ఝార్ఖండ్‌లో నిర్వహించిన నేషనల్ తైక్వాండో అండర్ 73 కేజీల విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లపల్లి మండల కేంద్రానికి చెందిన గిరిజన యువతి పాయం హర్షప్రద తెలంగాణ రాష్ట్రానికి సిల్వర్ మెడల్ సాధించింది. ఏజెన్సీ ప్రాంతానికి చెందిన గిరిజన యువతి విజయ సాధించడంపై ఆళ్లపల్లి మండలానికి చెందిన పలువురు అభినందనలు తెలిపారు.
News February 8, 2025
నల్గొండ పోలీసులకు తలనొప్పిగా పిల్లి కేసు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739017479623_691-normal-WIFI.webp)
పిల్లి పెట్టిన లొల్లి NLG పోలీసులకు తలనొప్పిగా మారింది. స్థానిక రహమత్ నగర్‌కు చెందిన పుష్పలత పెంచుకుంటున్న పిల్లి ఏడాదిక్రితం తప్పిపోగా PSలో ఫిర్యాదు చేశారు. పక్కింట్లో అదే పోలికలతో ఉన్న పిల్లి కనిపించగా ఆపిల్లి తమదేనని, పక్కింటి వారు ఎత్తుకెళ్లారంటూ Jan15న 2టౌన్ PSలో పుష్పలత కేసు పెట్టింది. పోలీసులు పిల్లి వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిచారు. పిల్లి ఎవరికి చెందుతుందో తేలాల్సి ఉంది.