News March 28, 2025
VKD: ఇంటి వద్దకే తలంబ్రాలు.. ఫోన్ చేయండి

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు పంపిస్తామని వికారాబాద్ డిపో మేనేజర్ గడ్డం అరుణ అన్నారు. భక్తులు కేవలం రూ.151 చెల్లించి, సమీపంలోని కార్గో కార్యాలయంలో ఏప్రిల్ 6లోగా బుకింగ్ చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు వికారాబాద్ డిపో-91542 98740, చేవెళ్ల డిపో-91775 67300, తొరమామిడి-77995 20031 నంబర్లకు సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News November 21, 2025
ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్నారు. కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి. ఇటీవల మొంథా తుఫాను ప్రభావంతో కోనసీమలోని కొబ్బరి రైతులు నష్టపోయిన విషయం తెలిసిందే.
News November 21, 2025
మల్దకల్: ఈనెల 25 నుంచి తిమ్మప్ప బ్రహ్మోత్సవాలు

మల్దకల్ మండల కేంద్రంలోని ఆదిశిలా క్షేత్రంలో కొలువైన తిమ్మప్ప స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 25 నుంచి డిసెంబర్ 9 వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా డిసెంబర్ 2న స్వామి కళ్యాణం, 3న తెప్పోత్సవం, 4న రాత్రి 11:00 గంటలకు రథోత్సవం నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి తెలిపారు. నడిగడ్డ తిరుపతిగా పేరుగాంచిన తిమ్మప్ప స్వామి ఉత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.
News November 21, 2025
వేములవాడ టెంపుల్ రెనోవేషన్.. రంగంలోకి బాహుబలి క్రేన్

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల కోసం అతిపెద్దదైన క్రేన్ను అధికారులు రంగంలోకి దించారు. ఆలయ దక్షిణ ప్రాకారం కూల్చివేత పనులు కొనసాగిస్తున్న క్రమంలో ప్రత్యేకంగా రప్పించిన బాహుబలి క్రేన్తో పనులు ప్రారంభించారు. రూ.150 కోట్లతో చేపట్టిన ఆలయ అభివృద్ధి పనుల కోసం హైదరాబాద్, చెన్నై తదితర ప్రాంతాల నుంచి తెప్పించిన అధునాతనమైన, అతిపెద్ద క్రేన్లు, డ్రిల్లింగ్ యంత్రాలను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.


