News March 28, 2025
VKD: ఇంటి వద్దకే తలంబ్రాలు.. ఫోన్ చేయండి

ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు పంపిస్తామని వికారాబాద్ డిపో మేనేజర్ గడ్డం అరుణ అన్నారు. భక్తులు కేవలం రూ.151 చెల్లించి, సమీపంలోని కార్గో కార్యాలయంలో ఏప్రిల్ 6లోగా బుకింగ్ చేసుకోవాలన్నారు. మిగతా వివరాలకు వికారాబాద్ డిపో-91542 98740, చేవెళ్ల డిపో-91775 67300, తొరమామిడి-77995 20031 నంబర్లకు సంప్రదించాలన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News March 31, 2025
విశాఖలో ఐదేళ్ల బాలిక పట్ల పీటీ అసభ్యకర ప్రవర్తన

విశాఖలో విద్యాబుద్ధులు నేర్పించాల్సిన మాస్టారే చిన్నారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన మధురవాడ పరిధిలో జరిగింది. వాంబే కాలనీలోని ఓ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో పీటీగా పనిచేస్తున్న రామచంద్రరావు ఐదేళ్ల చిన్నారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించాడు. దీంతో ఆ చిన్నారి భయపడి తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పింది. వెంటనే వీరు పీఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పీటీని సోమవారం అదుపులోకి తీసుకున్నారు.
News March 31, 2025
NLG: టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలు

ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. మిగతా ఆరుగురు మృతదేహాల కోసం గాలింపు చర్యలు నడుస్తున్నాయి. సహాయక పనులకు ఆటంకంగా ఉన్న స్టీల్‌ను తొలగిస్తూ లోకో ట్రైన్ ద్వారా టన్నెల్ బయటికి తరలిస్తున్నారు. సొరంగం లోపల అత్యధికంగా ఉన్న మట్టిని తవ్వకాలు చేపడుతూ కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని బయటకు తరలిస్తున్నారు.
News March 31, 2025
NLG: వ్యవసాయ అనుసంధాన పనులకూ ‘ఉపాధి’

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మరింత విస్తరించారు. తాజాగా వ్యవసాయ అనుసంధాన పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో ప్రధానంగా పంట పొలాల వద్దకు మట్టి రోడ్లు, పండ్ల తోటల పెంపకం, పశువుల కొట్టాలు, కోళ్లఫారాల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. ముఖ్యంగా రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. NLG జిల్లాలో సుమారు నాలుగు లక్షల జాబ్ కార్డులు ఉండగా.. సుమారు ఎనిమిది లక్షల మంది కూలీలు పనిచేస్తున్నారు.