News November 30, 2025
VMMCSHలో 266 పోస్టులు

న్యూఢిల్లీలోని V.M.M.కాలేజీ &సఫ్దార్‌జంగ్ హాస్పిటల్(VMMCSH) 266 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి ఎంబీబీఎస్, బీడీఎస్ అర్హత గల అభ్యర్థులు రేపటివరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.1000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. రాత పరీక్ష డిసెంబర్ 14న నిర్వహిస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.56,100 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://vmmc-sjh.mohfw.gov.in
Similar News
News March 26, 2026
మొదలైన SRHvsLSG టికెట్ల సేల్స్

IPL-2026 సందడి మొదలైంది. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే SRHvsLSG మ్యాచ్ టికెట్లు రిలీజ్ అయ్యాయి. District యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్లను <
News March 26, 2026
విశాఖకు చేరుకున్న భారీ నౌకలు

AP: గ్యాస్, పెట్రోల్ ఇబ్బందుల నేపథ్యంలో విశాఖ తీరానికి భారీ LPG, చమురు నౌకలు చేరుకున్నాయి. 47 వేల టన్నుల ఎల్‌పీజీతో BW Birch షిప్, 28 వేల టన్నుల క్రూడాయిల్‌తో MT Petroit షిప్ పోర్టుకు వచ్చాయి. యూఏఈ నుంచి ఈ రెండు నౌకలు ఈ నెల 20న బయలుదేరాయి. మధ్యలో వడినార్, ముంద్రా పోర్టుల్లో కొంత LPG, క్రూడ్‌ను దిగుమతి చేశాయి. తాజాగా వైజాగ్ హార్బర్ మౌత్‌లో లంగరేశాయి.
News March 26, 2026
రోజులో 2 గంటలు ట్రాఫిక్‌లోనే టెకీ జీవితం

గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణతో హైదరాబాద్ ఐటీ రంగం దూసుకుపోతోంది. అయితే ఇది ఉద్యోగుల ప్రయాణ సమయాన్ని పెంచేసిందని తాజా నివేదిక వెల్లడించింది. HYDలో ఒక్క ఐటీ ఉద్యోగి ఒకవైపు ప్రయాణానికే సగటున 59.5 నిమిషాలు వెచ్చిస్తున్నారు. అంటే రోజుకు దాదాపు రెండు గంటలు రోడ్ల మీద ట్రాఫిక్‌లోనే గడిచిపోతోంది. బెంగళూరు(67.5M), ఢిల్లీ(67.5M) స్థాయిలో హైదరాబాద్‌లోనూ ప్రయాణ సమయం పెరగడం ఆందోళన కలిగిస్తోంది.


