News February 22, 2025
VMRDA ప్లానింగ్ విభాగంపై సమీక్ష

VMRDA ప్లానింగ్ విభాగంపై మెట్రోపాలిటన్ కమిషనర్ విశ్వనాథన్ శనివారం సమీక్ష నిర్వహించారు. ప్రణాళికా విభాగానికి సంబంధించిన న్యాయపరమైన కేసులు సత్వరమే పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారులకు సంభందించిన రహదారి అభివృధ్ధి ప్రణాళికలను (RDP) సిద్ధం చెయ్యాలని ఆదేశించారు. సమావేశంలో ప్రధాన అర్బన్ ప్లానర్ శిల్పా, ప్లానింగ్ అధికారులు వేంకటేశ్వరరావు ఉన్నారు.
Similar News
News February 23, 2025
విశాఖలో నకిలీ పోలీస్ అరెస్ట్

విశాఖ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ పోలీస్‌ను ఎయిర్ పోర్ట్ సీఐ ఉమామహేశ్వరరావు శనివారం అరెస్ట్ చేశారు. NAD, శాంతినగర్ పార్క్ ఏరియాలో ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయనగరానికి చెందిన నిందుతుడు బోను దుర్గారావును అరెస్ట్ చేశారు. రెండు నకిలీ పోలీసు గుర్తింపు కార్డులు, బెదిరించి దోచుకున్న స్కూటీతో పాటు ఒక మొబైల్ ఫోన్ సీజ్ చేసి రిమాండ్‌కు తరలించారు.
News February 23, 2025
మిస్సింగ్ కేసులను ఛేదించిన విశాఖ పోలీసులు

విశాఖ టూ టౌన్ స్టేషన్ పరిధిలో విశాఖ, విజయనగరానికి చెందిన రెండు మిస్సింగ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మిస్సింగ్ కేసులపై టూ టౌన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేసి గుర్తించారు. ఇద్దరు మహిళలను శనివారం వారి కుటుంబ సభ్యులకు సురక్షితంగా అప్పగించారు. రెండు మిస్సింగ్ కేసులను ఛేదించిన టూ టౌన్ పోలీసులను ఉన్నతాధికారులు అభినందించారు.
News February 23, 2025
దువ్వాడ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు

దువ్వాడ మీదుగా సంబల్ పూర్ – ఈరోడ్ (08311/12), భువనేశ్వర్ – యస్వంత్ పూర్ (02811/12)రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. ప్రయాణీకుల రద్దీని నియంత్రించేందుకు మార్చి 12 నుంచి ఏప్రిల్ 30 వరకు ప్రతి బుధవారం సంబల్‌పూర్ – ఈరోడ్, మార్చ్ 1నుంచి ఏప్రిల్ 26వరకు ప్రతి శనివారం భువనేశ్వర్ – యస్వంత్ పూర్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించారు.. ప్రయాణికులు గమనించాలన్నారు.