News March 3, 2026

VMRDA ఫెసిలిటీ మేనేజర్ పోస్టులకు గడువు పొడిగింపు

image

VMRDA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పర్యాటక కేంద్రాల నిర్వహణ కోసం ఔట్‌సోర్సింగ్ విధానంలో ఫెసిలిటీ మేనేజర్ పోస్టులకు దరఖాస్తుల గడువును మార్చి 17వ తేదీ వరకు పొడిగించారు. ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ (OR) ఎంబీఏతో పాటు కనీసం 10 ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలు VMRDA అధికారిక వెబ్‌సైట్ www.vmrda.gov.inలో లభిస్తాయని మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్‌ తెలిపారు.

Similar News

News April 14, 2026

VJA: బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్!

image

బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఓ ముఠాను పటమట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల మేరకు.. ప్రసాదంపాడుకు చెందిన రాజేశ్ ఫ్యాన్సీ దుకాణం నడుపుతున్నాడు. IPL ప్రారంభం అవ్వగానే సబ్ బుకీ అవతారమెత్తాడు. రాధే ఎక్సేంజ్ బెట్టింగ్ యాప్ ద్వారా బెట్టింగ్ చేస్తున్నాడు. అతనిపై పోలీసులు నిఘా ఏర్పాటు చేసి సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతనికి సహకరిస్తున్న ఆనంద్ రెడ్డి, శివయ్యలను అదుపులోకి తీసుకున్నారు.

News April 14, 2026

కామారెడ్డిలో కూరగాయల ధరలు ఇలా!

image

కామారెడ్డి మార్కెట్లో కూరగాయల ధరలు మంగళవారం సాధారణంగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో కేజీ టమాటా రూ.20, బీరకాయ రూ.60, క్యాబేజీ రూ.50, కాకరకాయ రూ.60, ఆలుగడ్డ రూ.30, ఉల్లిపాయ రూ.20గా విక్రయిస్తున్నారు. అలాగే పాలకూర రూ.50, వంకాయ రూ.50, క్యారెట్ రూ.50, చిక్కుడు రూ.50, కాలీఫ్లవర్ రూ.50, క్యాప్సికమ్ రూ.50 ధరలకు లభిస్తున్నాయి. ధరలు స్థిరంగా ఉండటంతో వినియోగదారులు కొంత ఊరట వ్యక్తం చేస్తున్నారు.

News April 14, 2026

బాపట్ల: ఫై‌ఓవరపై దొరికిన వ్యక్తి మృతి..ఆచూకీ తెలిస్తే తెలపండి

image

బాపట్లలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి సోమవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం గుంటూరు రహదారి ఫ్లైఓవర్‌పై అపస్మారక స్థితిలో పడి ఉన్న అతడిని స్థానికులు 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. చికిత్స ఫలితం లేక మరణించాడని, మృతుడి ఆచూకీ తెలిసిన వారు వెంటనే పట్టణ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.