News February 27, 2025
VMWD: స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రముఖులు

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో ఘనంగా మహాశివరాత్రి జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. లింగోద్భవ సమయంలో గురువారం వేకువ జామున మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులతో పాటు, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్లు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి ఆశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు అర్చకులు చేస్తున్నారు.
Similar News
News December 18, 2025
ఈరోజు చివరి అవకాశం!

మార్గశిర మాసంలో గురువార వ్రతం ఆచరిస్తారు. అయితే ఈ నెలలో ఇదే చివరి గురువారం. ఈ వ్రతంతో లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చని పండితులు చెబుతారు. సంపద, సంతోషం, శ్రేయస్సు ఇంట్లో నిలవాలని కోరుకునేవారు ఈ వ్రతం చేస్తారు. ఇది మార్గశిరంలో ఏ ఒక్క గురువారం చేసినా సకల శుభాలు కలుగుతాయని శాస్త్ర వచనం. లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించడం వలన మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు లభిస్తాయి. ఈ పవిత్రమైన రోజును వినియోగించుకోండి.
News December 18, 2025
ధనుర్మాసం: మూడోరోజు కీర్తన

‘బలి చక్రవర్తి నుంచి 3 అడుగులు దానం పొందిన వామనుడు ఆకాశమంత పెరిగి 3 లోకాలను పాలించాడు. ఆ మూర్తి దివ్య చరణాలు స్మరించి, నామగానం చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయి. భక్తితో ఆచరిస్తే నెలకు 3 వర్షాలు కురుస్తాయి. పంటలు మంచి దిగుబడిని ఇస్తాయి. గోవులకు గ్రాసం లభిస్తుంది. పంటలు సమృద్ధిగా పండి దేశం సుభిక్షంగా ఉంటుంది. లోకానికి మంచి చేసే ఈ వ్రతాన్ని చేద్దాం’ అని గోదాదేవి తన సఖులను ఆహ్వానిస్తోంది. <<-se>>#DHANURMASAM<<>>
News December 18, 2025
కర్నూలు: AP, తెలంగాణలో ఎస్సైగా ఎంపిక.. చివరికి..!

కర్నూలు జిల్లా తుగ్గలి పోలీస్ స్టేషన్లో అనంతపురం(D) తాడిపత్రి మండలం ఎర్రగుంటపల్లికి చెందిన నరేశ్ ఎస్సైగా గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. 2022లో తెలంగాణ రాష్ట్రం చేపట్టిన ఎస్సై నియామకాల్లో ఎంపికయ్యారు. 2023లో ఏపీ విడుదల చేసిన ఎస్సై ఫలితాలలో ఉత్తీర్ణుడయ్యారు. తెలంగాణలో వద్దనుకొని ఏపీలో విధులు నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. అనంతపురం PTC కళాశాలలో ట్రైనింగ్ అనంతరం తుగ్గలిలో బాధ్యతలు చేపట్టారు.


