News October 10, 2025

VOAల మూడేళ్ల కాలపరిమితి ఉత్తర్వులు నిలిపివేత

image

AP: గ్రామ సంఘ సహాయకుల(VOA)కు సంబంధించి గత ప్రభుత్వం విధించిన మూడేళ్ల కాలపరిమితిని కూటమి సర్కార్ నిలిపివేసింది. VOA ఎంపిక లేదా తొలగింపు అనేది గ్రామ సంఘాల నిర్ణయం మేరకు ఉంటుందని తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. VOAలు అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని DRDA ప్రాజెక్టు డైరెక్టర్‌కు అప్పగించింది. కాగా రాష్ట్రంలో 27వేల మంది VOAలు పనిచేస్తున్నారు.

Similar News

News October 10, 2025

4 లక్షల మందిని రేప్ చేసిన పాక్ ఆర్మీ!

image

1971 బంగ్లాదేశ్ లిబరేషన్ వార్ టైమ్‌లో పాక్ ఎన్నో అకృత్యాలకు పాల్పడిందని UN వేదికగా భారత్ సంచలన విషయాలు వెల్లడించింది. నాడు 4 లక్షల మంది బంగ్లా మహిళలను పాక్ దళాలు రేప్ చేసినట్లు చెప్పింది. ‘Op సెర్చ్ లైట్’ పేరుతో మారణహోమం చేసిన పాక్ సైన్యం ఓ ప్లాన్ ప్రకారం సామూహిక అత్యాచారాలకు దిగిందని తెలిపింది. భారత్‌కు లొంగిపోయే దాకా దారుణాలు కొనసాగాయని, తీవ్రమైన లైంగిక హింసగా చరిత్రలో ఇది నిలిచిందని పేర్కొంది.

News October 10, 2025

కాఫ్ సిరప్ డెత్స్‌పై పిల్.. కొట్టేసిన సుప్రీంకోర్టు

image

దగ్గు మందు తాగి 20మందికి పైగా చిన్నారులు చనిపోయిన ఘటనపై దాఖలైన పిల్‌ను SC కొట్టేసింది. CBI దర్యాప్తు చేయాలని, డ్రగ్ సేఫ్టీపై రివ్యూ నిర్వహించాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని తిరస్కరించింది. విచారణ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు. ఆయా రాష్ట్రాలు ఈ కేసు విచారణ జరుపుతున్నాయని చెప్పారు. CBIతో దర్యాప్తు అవసరం లేదన్నారు. దీంతో CJIతో కూడిన ధర్మాసనం పిల్‌ను డిస్మిస్ చేసింది.

News October 10, 2025

ట్రంపు నిట్టూర్పు! ఇంకెన్ని యుద్ధాలాపితే దొరికేనో ‘శాంతి’

image

‘ఇంకా నేను ఎన్ని యుద్ధాలు ఆపాలి’, ‘ఇంకేం చేయాలి’ అని ట్రంప్ బాధపడుతున్నారేమో. ఎన్నో ఆశలు పెట్టుకున్న నోబెల్ ప్రైజ్ రాకపోవడంతో కచ్చితంగా నిరాశ చెందే ఉంటారు. తనకు ప్రైజ్ రాదని బయటకు ఎంత చెప్పుకున్నా లోలోపల ఉన్న చిన్న ఆశ నేటితో సమాధి అయింది. దీంతో ట్రంప్ ఏ దేశంపై ఏ రూపంలో విరుచుకుపడతారో అనే ఆందోళన లేకపోలేదు. ఇప్పుడు మిస్ అయినా వచ్చే ఏడాది దక్కించుకోవడానికి ఏం చేస్తారోనని నెట్టింట చర్చ జరుగుతోంది.