News September 12, 2024
మెటా ఏఐకి పబ్లిక్ ఫిగర్ల వాయిస్!

వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌కు త్వరలో <<13848701>>వాయిస్ వెర్షన్<<>> రానుంది. దీనిని డిఫరెంట్ వాయిస్‌లలో అందుబాటులోకి తేనున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది. మొదటగా ఇంగ్లిష్‌లో పలువురు ప్రజాదరణ పొందిన వ్యక్తుల గొంతులతో తీసుకురానున్నారని, భవిష్యత్తులో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెస్తారని తెలిపింది. యూజర్లు తమకు నచ్చిన వాయిస్‌ను ఎంచుకుని వాడుకోవచ్చని వివరించింది.
Similar News
News October 7, 2025
‘SIR’ ఎన్నికల కమిషన్ విశేషాధికారం: SC

బిహార్‌లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ఎన్నికల కమిషన్ విశేషాధికారమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఇందులో జోక్యం చేసుకోలేమని విచారణ సందర్భంగా పేర్కొంది. అందరి విధుల్లో తాము జోక్యం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారని పిటిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అటు బిహార్‌లో ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను ప్రకటించినట్లు కోర్టుకు EC తెలిపింది. రాజకీయ నాయకులే అనవసర వివాదాలు సృష్టిస్తున్నారని వివరించింది.
News October 7, 2025
కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి విటమిన్ D

గర్భస్థ శిశువు ఆరోగ్యానికి విటమిన్ D ఎంతో అవసరమంటున్నారు పరిశోధకులు. ఫీటల్ స్కెలిటన్ గ్రోత్, ప్లాసెంటా, తల్లి రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు D విటమిన్ తగినంత ఉండాలని చెబుతున్నారు పెన్‌స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. లేదంటే నెలలు నిండకుండా పుట్టడం, ఫీటల్ లెంత్ తక్కువగా ఉండటం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. <<-se>>#PregnancyCare<<>>
News October 7, 2025
కన్నడ ‘బిగ్‌బాస్’కు షాక్.. నిలిచిపోయిన షో

కన్నడ హీరో కిచ్చా సుదీప్ హోస్ట్ చేస్తున్న బిగ్‌బాస్ షో నిలిచిపోయింది. కర్ణాటక స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(KSPCB) నోటీసులతో మేకర్స్ షూటింగ్ నిలిపేశారు. షూటింగ్ జరుగుతున్న జాలీవుడ్ స్టూడియోస్‌లో కాలుష్య నియంత్రణ చర్యలు చేపట్టడం లేదని యాక్టివిస్టులు ఆందోళన చేయడంతో KSPCB చర్యలు తీసుకుంది. స్టూడియో నుంచి వస్తున్న కలుషిత నీటితో స్థానిక ఎకోసిస్టం దెబ్బతింటోందని పేర్కొంది.