News July 20, 2024
దాడులపై పార్లమెంట్లో గళం వినిపించాలి: జగన్
AP: వైసీపీ లోక్సభ, రాజ్యసభ ఎంపీలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. 23వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. ఏపీలో జరుగుతున్న దాడులపై పార్లమెంట్లో చర్చ జరిగేలా చూడాలని జగన్ సూచించారు. అలాగే 22 నుంచి జరగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఆందోళన చేయాలని వైసీపీ నిర్ణయించింది.
Similar News
News December 21, 2024
పార్వతీపురం: స్పందించి.. ప్రాణాన్ని కాపాడారు..!
ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పార్వతీపురం GRP, RPF పోలీసులు శనివారం కాపాడారు. GRP హెచ్సీ రత్నాకర్ వివరాల ప్రకారం.. పార్వతీపురం బైపాస్ కాలనీకి చెందిన B.తిరుపతిరావు ఆత్మహత్య చేసుకోడానికి బెలగాం స్టేషన్ సమీపంలో పట్టాలపై పడుకున్నాడు. అతనిని గమనించిన గూడ్స్ గార్డు సమాచారమివ్వగా.. వెంటనే స్పందించి ఘటనా స్థలానికి వెళ్లి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News December 21, 2024
శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది: కిమ్స్
TG: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ ఆరోగ్యంపై కిమ్స్ ఆస్పత్రి బులిటెన్ విడుదల చేసింది. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని, వెంటిలేటర్ సాయం లేకుండా శ్వాస తీసుకుంటున్నట్లు వివరించింది. అప్పుడప్పుడూ జ్వరం వస్తోందని పేర్కొంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఆరోగ్యం మెరుగుపడినట్లు వైద్యులు బులిటెన్లో వెల్లడించారు. అటు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు.
News December 21, 2024
కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్మీట్
TG: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాత్రి 7 గంటలకు ప్రెస్మీట్ పెట్టనున్నారు. సంధ్య థియేటర్ ఘటనపై ఇవాళ <<14942476>>అసెంబ్లీలో<<>> సీఎం రేవంత్ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్పై ఆయనతో పాటు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో బన్నీ ప్రెస్ మీట్ పెట్టనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు? అనే విషయంపై ఆసక్తి నెలకొంది.