News August 3, 2024
జీతాలు చెల్లించాలని మంత్రికి వాలంటీర్ల విజ్ఞప్తి

AP: తమను విధుల్లోకి తీసుకోవాలని గత కొద్దిరోజులుగా వాలంటీర్లు అధికారులు, ప్రజాప్రతినిధులను వేడుకుంటున్నారు. తమకు రెండు నెలలుగా బకాయి పడ్డ గౌరవ వేతనం అందించాలని విజయవాడలో మంత్రి కొల్లు రవీంద్రను తాజాగా పలువురు కలిసి విజ్ఞప్తి చేశారు. వైసీపీ నేతల ఒత్తిడితో తాము చేసిన రాజీనామాలను బలవంతంగా చేసినవిగా గుర్తించాలని కోరారు. తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని మంత్రికి వినతిపత్రం అందించారు.
Similar News
News March 10, 2026
చమురు సంక్షోభం.. రష్యాకు జాక్‌పాట్!

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం, హార్ముజ్ జలసంధి మూసివేతతో చమురు సంక్షోభం నెలకొందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఈ క్రమంలో తాము యూరప్ దేశాలకు ఆయిల్, గ్యాస్ సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. ‘యురోపియన్ కంపెనీలు, కొనుగోలుదారులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా దీర్ఘకాలిక సహకారం అందిస్తామంటే ఆయిల్ పంపడానికి మాకు అభ్యంతరం లేదు’ అని స్పష్టం చేశారు. అటు రష్యాపై ఆంక్షలు ఎత్తివేయాలని US భావిస్తోంది.
News March 10, 2026
‘ఒక్క లీటర్ ఆయిల్ కూడా పోనివ్వం’.. ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్

ఆయిల్ సప్లైని ఆపితే భారీ మూల్యం తప్పదన్న ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. హార్ముజ్ జలసంధి నుంచి ఒక్క లీటర్ ఆయిల్‌ను కూడా వెళ్లనివ్వబోమని తేల్చి చెప్పింది. ఇజ్రాయెల్, అమెరికా దాడులు కొనసాగితే శత్రు దేశాల ఆయిల్‌ను కదలనివ్వబోమని US మిలిటరీ బేస్‌లున్న UAE, సౌదీ, ఖతర్ వంటి దేశాలను హెచ్చరించింది. ఇప్పటికే ఆయిల్ ధరలు పెరిగి ఆందోళనలో ఉన్న కంట్రీస్‌ను ఈ హెచ్చరికలు మరింత కలవరపరుస్తున్నాయి.
News March 10, 2026
రాజకీయాల్లో అరుదైన ఘనత.. ఈ నేతల స్పెషాలిటీ ఇదే

బిహార్ సీఎం నితీశ్ కుమార్ రాజ్యసభకు ఎన్నికవగానే ఓ అరుదైన ఘనత సాధించనున్నారు. MLA, MLC, లోక్‌సభ ఎంపీ, రాజ్యసభ ఎంపీ, సీఎం, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడిగా నిలవనున్నారు. ఇక ఉమ్మడి ఏపీలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి మినహా మిగతా పదవులను చేపట్టారు. అలాగే బెజవాడ పాపిరెడ్డి శాసన సభ, మండలి, రాజ్యసభ, లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. మీకు తెలిసిన ఇలాంటి నేతలు ఉంటే కామెంట్ చేయండి.


