News November 21, 2024
వాలంటీర్లు YCP కోసం పని చేయలేదు: కన్నబాబు

AP: వాలంటీర్లు YCP కోసం పని చేయలేదని, కానీ వారిని ప్రభుత్వం తమ పార్టీ సానుభూతిపరులుగా చూస్తోందని వైసీపీ నేత కన్నబాబు మండిపడ్డారు. ‘అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. తప్పుడు హామీలతో వాలంటీర్లను మభ్య పెట్టారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థే లేదని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక వారికి జీతాలెలా ఇచ్చారు. వ్యవస్థే లేకపోతే న్యూస్ పేపర్‌కు ఇచ్చే రూ.200 ఎలా రద్దు చేశారు’ అని ఆయన ప్రశ్నించారు.
Similar News
News November 26, 2025
AI చెప్పిన.. టాలీవుడ్ టాప్ హీరోలు వీరే

ఏఐ చాట్‌బోట్లయిన జెమిని, చాట్ Gpt, గ్రోక్‌లు టాలీవుడ్లో నంబర్ 1 హీరో డార్లింగ్ ప్రభాస్ అని ఏకాభిప్రాయం వ్యక్తం చేశాయని సినీవర్గాలు తెలిపాయి. gemini: ప్రభాస్, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, మహేశ్ బాబు. – Chatgpt: ప్రభాస్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, NTR, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ – Grok- ప్రభాస్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, NTR, రామ్ చరణ్, పవన్. మరి మీ దృష్టిలో టాప్-6 టాలీవుడ్ హీరోలెవరు?COMMENT
News November 26, 2025
APPLY NOW: BECILలో ఉద్యోగాలు

బ్రాడ్కాస్ట్ ఇంజినీర్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) 18 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెడికల్ ఫిజిసిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఇంటర్, PG, PG డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. డ్రైవర్ పోస్టుకు హెవీ వెహికల్ లైసెన్స్ తప్పనిసరి.
News November 26, 2025
రేవంత్ రూ.50వేల కోట్ల విద్యుత్ స్కాం: హరీశ్‌రావు

TG: CM రేవంత్ మరో అతిపెద్ద పవర్ స్కాంకు రూపకల్పన చేశారని, ఇది అక్షరాల రూ.50వేల కోట్ల కుంభకోణం అని హరీశ్‌రావు ఆరోపించారు. పవర్ ప్లాంట్ల నిర్మాణానికి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుని, కమీషన్ల కక్కుర్తికి మాస్టర్ ప్లాన్ వేశారని మీడియా సమావేశంలో తెలిపారు. ఒక్కో యూనిట్‌కు రూ.7.92 ఖర్చు చేయబోతున్నారని, ఇది ఎవరి ప్రయోజనం కోసం అని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ కోసమే కొత్త డిస్కం తెస్తున్నారని విమర్శించారు.


