News March 17, 2024

వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దు: కలెక్టర్

image

ప.గో జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన వివరాలను కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం వెల్లడించారు. మొత్తం 1,463 పోలింగ్ స్టేషన్లలలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎలాంటి విధులను కూడా సచివాలయ పరిధిలోని వాలంటీర్లకు అప్పజెప్పడం లేదని, పరోక్షంగా వాలంటీర్లు ఎవరికైనా సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Similar News

News January 29, 2026

ఉగాది నాటికి 9,135 గృహాల పూర్తి: కలెక్టర్ ఆదేశం

image

పశ్చిమ గోదావరి జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు వచ్చే ఉగాది నాటికి 9,135 గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆమె ఆదేశించారు. గూగుల్ మీట్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ పిచ్చయ్య పాల్గొన్నారు.

News January 29, 2026

కోపల్లె బ్రిడ్జి పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్

image

కాళ్ల మండలం కోపల్లె బ్రిడ్జి వద్ద పనులకు గురువారం డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. 4 లైన్ల బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నామని, 6 నెలల కాలంలో ఈ బ్రిడ్జి పనులను పూర్తి చేస్తామన్నారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.

News January 29, 2026

ప.గో: తీర్థం వెళ్లేవారికి గుడ్ న్యూస్

image

అంతర్వేది భీష్మ ఏకాదశి సందర్భంగా జిల్లాలోని పాఠశాలలకు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సెలవు ఇచ్చేందుకు డీఈఓ నారాయణ అంగీకరించినట్లు ఫ్యాప్టో నాయకుల తెలిపారు. వారి విజ్ఞప్తి మేరకు హెచ్‌ఎంలు, ఎంఈఓలకు సమాచారం అందించి ఈ సెలవును వినియోగించుకోవచ్చన్నారు. తీర్థం వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులకు వెసులుబాటు కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంపై ఫ్యాప్టో నేతలు విజయరామరాజు, ప్రకాశం, సాయి వర్మ హర్షం వ్యక్తం చేశారు.