News July 5, 2024
ట్రాఫిక్ సమస్యల పరిష్కార సేవల్లో వాలంటీర్లు

TG: ట్రాఫిక్ సమస్యల పరిష్కారంలో కాలేజీ విద్యార్థులను వాలంటీర్లుగా రవాణా శాఖ వినియోగించుకోనుంది. ఆగస్టు నుంచి ప్రతి నెలా ఒక గంట తమ కాలేజీల సమీపంలో పోలీసులకు సహకారంగా వీరు విధులు నిర్వహిస్తారు. తొలుత HYDలో, ఆ తర్వాత రాష్ట్రంలో అమలు చేస్తారు. 300 మంది NSS విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతపై శిక్షణ ఇచ్చారు. వీరు ఒక్కొక్కరు 100 మందికి శిక్షణ ఇచ్చి, మొత్తంగా 3 లక్షల మందిని సిద్ధం చేస్తున్నారు.
Similar News
News December 26, 2025
రింకూ సింగ్ సెంచరీ

విజయ్ హజారే ట్రోఫీలో UP కెప్టెన్ రింకూ సింగ్ అదరగొట్టారు. చండీగఢ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 56 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఆర్యన్ జుయల్ (134) కూడా చెలరేగడంతో UP 50 ఓవర్లలో 367/4 పరుగుల భారీ స్కోరు చేసింది. మరోవైపు గుజరాత్‌తో మ్యాచ్‌లో కోహ్లీ(77), పంత్(70) హాఫ్ సెంచరీలతో ఢిల్లీ 254/9 స్కోరు చేసింది. ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ విఫలమైనా హార్దిక్ తమోర్(93) రాణించడంతో ముంబై 331/7 కొట్టింది.
News December 26, 2025
పీరియడ్స్‌లో వీటికి దూరంగా ఉండండి

పీరియడ్స్ సమయంలో వాకింగ్, యోగా వంటి తక్కువ ప్రభావమున్న వ్యాయామాలు చేయవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. కానీ, అధిక బరువులు ఎత్తడం, రన్నింగ్, దూకడం, వంటి శరీరంపై అధిక ప్రభావం చూపించే వ్యాయామాలు చేయకూడదని సూచిస్తున్నారు. ముఖ్యంగా కార్డియో, ఓవర్‌హెడ్ , క్రంచెస్, స్క్వాట్స్ వంటి వ్యాయామాలు చేయకూడదని చెబుతున్నారు. వీటివల్ల శరీరంపై ఒత్తిడి పెరిగి ఎక్కువ బ్లీడింగ్ అయ్యేఅవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
News December 26, 2025
మిరపలో పూత పురుగును ఎలా నివారించాలి?

మిరప పూత మొగ్గలపై ఈ మొగ్గలు గుడ్లు పెడతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన చిన్న లార్వాలు పూలలోని అండాశయాన్ని తొలిచి తింటాయి. దీని వల్ల అండాశయం తెల్లగా మారి ఉబ్బుతుంది. మొగ్గలు విచ్చుకోకుండ రాలిపోతాయి. పిందే దశలో కాయలు గిడసబారి గింజలు లేకుండా త్వరగా పండుబారి విపరీతంగా రాలిపోతాయి. పూత పురుగును నివారించడానికి లీటరు నీటికి Tolfenpyrad అనే మందు 2mlను కలిపి పిచికారీ చేసుకోవాలి.


