News August 27, 2024
31 నుంచి ‘వాలంటీర్ల నివేదన’ కార్యక్రమం

AP: మూడు నెలల బకాయిలు ఇవ్వాలని ₹10,000 జీతం హామీని వెంటనే అమలు చేయాలని వాలంటీర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. గత ఎన్నికలకు ముందు రాజీనామా చేసిన లక్ష మందిని విధుల్లోకి తీసుకోవాలని కోరింది. రేపు జరిగే మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల ఉద్యోగ భద్రతపై స్పష్టమైన ప్రకటన చేయాలంది. లేదంటే CM చంద్రబాబు, Dy.CM పవన్‌కు తమ ఆవేదన తెలిసేలా ఈ నెల 31 నుంచి వాలంటీర్ల నివేదన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రకటించింది.
Similar News
News January 24, 2026
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో వేతనాలు, పెన్షన్ల పెంపు

జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు, నాబార్డ్, RBI ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు పెరిగాయి. 46,322 మంది ఉద్యోగులు, 46,830 మంది పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్లకు లబ్ధికలగనుంది. బీమా ఉద్యోగులకు 2022 ఆగస్టు, నాబార్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, RBI పెన్షనర్లకు 2022 నవంబర్ నుంచి ఈ పెంపు వర్తించనుంది. దీంతో బీమా ఉద్యోగులకు 12.41%, నాబార్డ్-20% జీతం పెరగనుంది. RBI పెన్షనర్లకు 10% పెరగనుంది.
News January 24, 2026
వేసవి సెలవుల్లో టీచర్ల బదిలీలు!

AP: వేసవి సెలవుల్లో(ఏప్రిల్-మే) టీచర్ల బదిలీల ప్రక్రియ ప్రారంభమవుతుందని పాఠశాల విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైస్కూల్ ప్లస్‌లో ఖాళీల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. వేసవి సెలవుల్లో పని చేసిన టీచర్లకు ఆర్జిత సెలవులు ఇస్తామని పేర్కొన్నారు. ఉపాధ్యాయ సంఘాలతో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. రెగ్యులర్ పోస్టుల ఖాళీలు ఏర్పడే వరకు క్లస్టర్ టీచర్లు అక్కడే కొనసాగుతారని అన్నారు.
News January 24, 2026
Grok సేవలకు అంతరాయం

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌బాట్ Grok సేవలకు అంతరాయం ఏర్పడింది. గ్రోక్ యాప్, ట్విటర్‌లోలోనూ అందుబాటులో లేదు. ‘హై డిమాండ్ కారణంగా గ్రోక్ కొన్ని సమస్యలు ఎదుర్కొంటోంది. వాటిని సరిచేసేందుకు మేము కృషి చేస్తున్నాం. సాధ్యమైనంత త్వరగా మీకు సేవలను అందుబాటులోకి తీసుకొస్తాం’ అని xAI సంస్థ తెలిపింది.


