News September 8, 2025

దేశవ్యాప్తంగా అందుబాటులోకి VoNR: JIO

image

దేశం అంతటా VoNR (Voice over 5G) సేవలను JIO యాక్టివేట్ చేసింది. ఇప్పటివరకూ VoLTE ఉండగా ప్రస్తుతం 5G నెట్‌వర్క్‌పై పనిచేసే VoNR అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల నెట్‌వర్క్ వీక్‌గా ఉన్నప్పుడు 5G నుంచి 4Gకి మారడం లాంటి సమస్యలు ఉండవు. కాల్ నాణ్యత మెరుగవుతుంది. స్పష్టంగా వినిపిస్తుంది. కాల్ త్వరగా కనెక్ట్ అవుతుంది. బ్యాటరీ ఆదా అవుతుంది. ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా ఇంటర్నెట్ వేగం తగ్గదు.

Similar News

News September 9, 2025

డొనాల్డ్ ట్రంప్ మనవరాలిని చూశారా?

image

యూఎస్ ఓపెన్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీ సందడి చేసింది. ఈ ఈవెంట్‌కు ట్రంప్‌తో పాటు ఇవాంకా భర్త జారెడ్ కుష్నర్, వారి కుమార్తె అరబెల్లా రోజ్ కుష్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ మీడియా కళ్లన్నీ 13 ఏళ్ల అరబెల్లానే ఫోకస్ చేయడంతో ఆమె హైలైట్ అయ్యారు. తన తాత ట్రంప్‌తో ముచ్చటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

News September 9, 2025

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ఎంపీలతో లోకేశ్ భేటీ

image

AP: ఉపరాష్ట్రపతి ఓటింగ్ ప్రక్రియపై మంత్రి నారా లోకేశ్ టీడీపీ ఎంపీలకు పలు సూచనలు చేశారు. రేపు వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లారు. అక్కడ టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించారు. కాగా టీడీపీకి లోక్‌సభలో 16, రాజ్యసభలో ఇద్దరు ఎంపీల బలం ఉంది.

News September 8, 2025

ఇకపై ప్రతి రోజూ తిరుపతి-షిర్డీ రైలు

image

AP: సీఎం చంద్రబాబు ప్రతిపాదన మేరకు ఇకపై ప్రతి రోజూ తిరుపతి-షిర్డీ మధ్య రైలు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. 07637/07638 నంబర్ రైలు రేణిగుంట, కడప, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ మీదుగా ప్రయాణిస్తుంది. బ్రహ్మోత్సవాలు, పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ రైలును రెగ్యులర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ రైలు టెంపరరీ సర్వీస్‌గా కొనసాగింది.