News May 13, 2024
భవిష్యత్తు కోసమే ఓటు: జగన్

AP: ఐదేళ్లుగా రాష్ట్రంలో ప్రభుత్వ సుపరిపాలన చూశారని సీఎం జగన్ అన్నారు. ప్రజలు తమ భవిష్యత్తు కోసం ఓటు వేస్తారని పులివెందులలో మాట్లాడారు. మరోవైపు ఓటు జీవితాన్ని మారుస్తుందని ఉండవల్లిలో ఓటు వేసిన అనంతరం టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భాగమవ్వాలని.. ఎవ్వరూ అశ్రద్ధ చేయొద్దని కోరారు.
Similar News
News February 2, 2026
నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు: పవన్

AP: రసాయనాలతో తిరుమల లడ్డూ ప్రసాదం తయారుచేసి YCP మహాపరాధం చేసిందని Dy.CM పవన్ ఆరోపించారు. నెయ్యిలో జంతు కొవ్వు లేదని సిట్ నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని, అయినా YCP విష ప్రచారం చేస్తోందని విమర్శించారు. ‘లడ్డూలో వినియోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదు. రూ.400కి కిలో నువ్వుల నూనె దొరకదు.. అలాంటిది ఆవు నెయ్యి ఎలా ఇచ్చారు? దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని పార్టీ మీటింగ్‌లో నేతలకు సూచించారు.
News February 2, 2026
ఈ FEB అరుదైన నెల అంటూ ప్రచారం.. నిజమెంత?

2026 ఫిబ్రవరి 823 ఏళ్లకోసారి వచ్చే అరుదైన నెల అంటూ SMలో ప్రచారం జరుగుతోంది. ఈ నెలలో ప్రతి వారం సరిగ్గా 4 సార్లు రావడమే ఇందుకు కారణం. అయితే ఈ ప్రచారం అవాస్తవం. నిజానికి లీప్ ఇయర్ కాని ప్రతి ఏటా FEBలో 28 రోజులే ఉంటాయి. అంటే ప్రతి వారం కచ్చితంగా 4 సార్లే వస్తుంది. ఈ ఏడాది ఫిబ్రవరి ఆదివారంతో మొదలవడంతో క్యాలెండర్‌లో తేదీలు క్రమ పద్ధతిలో కనిపిస్తున్నాయి. గతంలో 2015లో ఇలాగే జరగగా, 2037లోనూ రానుంది.
News February 2, 2026
ఎయిరిండియా విమానంలో ‘ఫ్యూయల్ స్విచ్’ సమస్య!

లండన్-బెంగళూరు ఎయిరిండియా విమానంలో ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌లో లోపం ఉన్నట్లు పైలట్ గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ బోయింగ్ 787-8 విమానాన్ని గ్రౌండ్ చేశారు. విమాన తయారీ సంస్థ (OEM)తో చెకింగ్ చేయిస్తున్నారు. ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA దృష్టికీ తీసుకెళ్లారు. గత ఏడాది 260 మంది మృతికి కారణమైన అహ్మదాబాద్ విమాన ప్రమాదం ఫ్యూయల్ స్విచ్ సమస్యల వల్లే జరిగిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


