News May 25, 2024
ఓటేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

దేశంలో 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూఢిల్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఢిల్లీలో ఓటేశారు. ఝార్ఖండ్లోని రాంచీలో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్, భువనేశ్వర్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News November 14, 2025
వివాహం గురించి వేదాలేమంటున్నాయి?

పెళ్లంటే నూరేళ్ల పంట. వివాహం కుటుంబ వ్యవస్థకు ప్రధానమైన ఆధారం. ఇది గృహస్థాశ్రమ ధర్మానికి నాంది. మన మేధో వికాసానికి, సామాజిక ఎదుగుదలకు ఇది అత్యంత ముఖ్యమైనదని వేదాలు కూడా చెబుతున్నాయి. ఈ పవిత్ర వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచమంతా కొనియాడుతుంది. వివాహం ద్వారానే సంస్కృతికి, సమాజానికి పునాది పడుతుంది. అందుకే ఈ బంధాన్ని పవిత్రంగా గౌరవించాలి. ఈ బంధం రేపటి తరానికి ఉత్తమమైన వారసత్వాన్ని అందిస్తుంది. <<-se>>#Pendli<<>>
News November 14, 2025
ఆర్చరీలో సత్తా చాటిన తెలుగు కుర్రాడు

ఆసియా ఆర్చరీ ఛాంపియన్షిప్లో తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర(VJA) చరిత్ర సృష్టించారు. వ్యక్తిగత విభాగంలో రాహుల్(IND)పై 6-2 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ సాధించారు. మహిళల విభాగంలో అంకితా భకత్ 7-3 తేడాతో సౌ.కొరియా ఆర్చర్ నామ్ సు-హ్యోన్పై నెగ్గి గోల్డ్ గెలిచారు. ఏషియన్ రికర్వ్ ఆర్చరీలో INDకు ఇవే తొలి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్ కావడం విశేషం. ఈ టోర్నీలో IND 6 గోల్డ్, 3 సిల్వర్, ఒక బ్రాంజ్ మెడల్ నెగ్గింది.
News November 14, 2025
8 రోజులు క్రిస్మస్ సెలవులు!

తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనార్టీ స్కూలు విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 25న క్రిస్మస్ సందర్భంగా 21 నుంచి 28 వరకు హాలిడేస్ ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. అటు మిగతా స్కూల్ విద్యార్థులకు క్రిస్మస్ రోజు మాత్రమే సెలవు ఉంటుంది.


