News May 14, 2024

అర్ధరాత్రి వరకు ఓటేశారు

image

AP: రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగింది. పాయకరావుపేట, కళ్యాణదుర్గం, సర్వేపల్లి, చింతలపూడి, మచిలీపట్నంలలో తేదీ మారడంతో మళ్లీ మాక్ పోలింగ్ నిర్వహించి, ఓటింగ్ కొనసాగించాల్సి వచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత 3,500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. ఈ సారి రికార్డు స్థాయిలో 80% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా.

Similar News

News March 8, 2026

ఏడాదిలో మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలు: సీఎం

image

AP: తెలుగు మహిళలు ఏ పని తలపెట్టినా లక్ష్యాన్ని సాధించే వరకు వదిలిపెట్టరని CM CBN కొనియాడారు. అమరావతిలో నిర్వహించిన మహిళా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘డ్వాక్రా మహిళల ఉత్పత్తుల కోసం తీసుకొచ్చిన స్వయం బ్రాండ్‌ను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్తా. అప్పులు ఇప్పించే బాధ్యత నాది.. సద్వినియోగం చేసుకోవడం మీ పని. ఇప్పటికే మహిళా పారిశ్రామికవేత్తలు లక్ష దాటారు. ఏడాదిలో మరో 5L మందిని తయారుచేస్తాం’ అని పేర్కొన్నారు.

News March 8, 2026

అమెరికా, గల్ఫ్ దేశాలకు ఉక్రెయిన్ హెల్ప్

image

ఇరాన్ షాహెద్ డ్రోన్లను అడ్డుకోవడం గల్ఫ్ దేశాలకు తలకు మించిన భారం అవుతోంది. $30వేల విలువైన ఆ డ్రోన్‌ను నేలకూల్చేందుకు $3.7 మి. <<19293310>>ఖర్చు<<>> చేయాల్సి వస్తోంది. అయితే రష్యా తమపై ప్రయోగిస్తున్న షాహెద్ డ్రోన్లను ఉక్రెయిన్ తక్కువ ఖర్చుతో ($1,000-2,000) సొంతంగా తయారు చేసుకున్న డ్రోన్లతో విజయవంతంగా అడ్డుకుంటోంది. దీంతో US, గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్ సాయం కోరాయి. వాటిని ఇచ్చేందుకు జెలెన్‌స్కీ సైతం అంగీకరించారు.

News March 8, 2026

1,300 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(IDBI)లో 1,300 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో 1,100 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్, 200 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులున్నాయి. వయసు 21-30 ఏళ్లు, డిగ్రీ పాసైన వారు అర్హులు. రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 19.
వెబ్‌సైట్: https://www.idbi.bank.in/