News March 23, 2024
26లోపు ఓటర్ల దరఖాస్తులను పరిష్కరించాలి: సీఈవో
AP: ఓటర్ల జాబితాలో మార్పుల కోసం సమర్పించిన ఫాం-7, ఫాం-8 దరఖాస్తులను ఈ నెల 26లోపు పరిష్కరించాలని అధికారులను సీఈవో ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఫాం-6లను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల పరిధిలోనే కాకుండా రాష్ట్రాల సరిహద్దుల్లోనూ నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రతి తనిఖీ కేంద్రం వద్ద ఒక కెమెరాతో స్టాటిక్ సర్వెలెన్స్ బృందాన్ని ఉంచాలన్నారు.
Similar News
News November 2, 2024
కులగణన.. ప్రశ్నలు ఇవే!
TG: నవంబర్ 6 నుంచి 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా కులగణన జరగనుంది. ఇందుకోసం 75 ప్రశ్నలను సిద్ధం చేశారు. కుటుంబసభ్యుల పేర్లు, మతం, కులం, వయసు, మాతృభాష, మొబైల్, రేషన్ కార్డు నంబర్, విద్య, ఉద్యోగం, వృత్తి, ఆదాయం, భూములు, ఇల్లు, రిజర్వేషన్ ప్రయోజనాలు, వలసలు, ఐదేళ్ల నుంచి తీసుకున్న లోన్ల గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతారు. ఎలాంటి ఫొటోలు, డాక్యుమెంట్లు తీసుకోరు. సర్వే టైంలో కుటుంబ యజమాని ఒకరు ఉంటే సరిపోతుంది.
News November 2, 2024
మళ్లీ CSKలోకి అశ్విన్?
ఐపీఎల్ మెగా వేలంలో రవిచంద్రన్ అశ్విన్ను కొనుగోలు చేయాలని CSK భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ 38 ఏళ్ల ఆల్రౌండర్ 2008 నుంచి 2015 వరకు చెన్నై తరఫున ఆడారు. ఆ తర్వాత వేరే ఫ్రాంచైజీలకు వెళ్లారు. రాజస్థాన్ రిటైన్ చేసుకోకపోవడంతో అశ్విన్ అనుభవాన్ని ఉపయోగించుకోవాలని CSK యోచిస్తోందని TOI తెలిపింది. మరోవైపు ఓపెనర్ డెవాన్ కాన్వేను RTM ద్వారా సొంతం చేసుకోవాలని చెన్నై ప్రణాళికలు రచిస్తోందని పేర్కొంది.
News November 2, 2024
69% కుటుంబాలపై కాలుష్య ప్రభావం
ఢిల్లీలో కాలుష్యం తీవ్ర రూపం దాలుస్తోంది. నగరంలోని 69% కుటుంబాల్లోని ఎవరో ఒకరు కాలుష్య సంబంధిత ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు పొల్యూషన్ సర్వేలో తేలింది. కాలుష్య స్థాయులు పెరగడం వల్ల కళ్లలో మంట, శ్వాసలో ఇబ్బందులు వస్తున్నట్లు వెల్లడైంది. దీపావళి రోజు రాత్రి ఢిల్లీతో పాటు NCRలోని పలు ప్రాంతాల్లో AQI 999కి చేరుకుంది. అటు యమునా నదిలో సైతం కాలుష్యం వల్ల భారీ స్థాయిలో నురగలు ఏర్పడ్డాయి.