News September 21, 2025

ఓటర్ల జాబితా.. మీ పేరు చెక్ చేసుకోండి!

image

TG: రాష్ట్రంలో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎంపీటీసీ, పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను ఇప్పటికే ప్రకటించింది. ఆ జాబితా చూసేందుకు ఇలా చేయండి.
<>tsec.gov.in<<>> సైట్ ఓపెన్ చేయాలి. Final Rolls Ward Wise Voter Listపై క్లిక్ చేయాలి. అందులో జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ పేర్లు సెలక్ట్ చేసుకోగానే వార్డుల వారీగా లిస్టు కనిపిస్తుంది.
Share It

Similar News

News September 21, 2025

H1B ఫీజు రూల్స్.. పూర్తి వివరాలు

image

*కొత్తగా H1B కోసం అప్లై చేసుకునే వారికే వర్తిస్తుంది. (అంటే 2026 నుంచి వీసా పిటిషన్ ఫైల్ చేసే వారికి)
*కొత్త వీసా కోసం కంపెనీలు లక్ష డాలర్లు ఒకేసారి చెల్లించాలి. ప్రతి ఏడాది కట్టాల్సిన అవసరం లేదు
*ప్రస్తుతం H1B వీసా ఉన్నవారికి ఇది వర్తించదు
*వీసా రెన్యూవల్స్, 2025 లాటరీ విన్నర్లకూ మినహాయింపు
*ప్రస్తుతం వీసా ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లవచ్చు. తిరిగి అమెరికాకు వచ్చేటప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉండవు.

News September 21, 2025

లైంగిక వేధింపులపై యువతి ఫిర్యాదు.. KA పాల్‌పై కేసు నమోదు

image

TG: ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌పై కేసు నమోదైంది. తనను పాల్ లైంగికంగా వేధించాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది. దీంతో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు FIR నమోదు చేశారు. ఫిర్యాదు చేసిన యువతి కేఏ పాల్ వద్ద పని చేసినట్లు తెలుస్తోంది.

News September 21, 2025

ఈసారి దేవీ నవరాత్రులు 10 రోజులు ఎందుకు?

image

నేటి నుంచి ప్రారంభం కానున్న శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజులకు బదులుగా 10 రోజులు జరగనున్నాయి. సెప్టెంబర్ 24, 25 తేదీలలో తృతీయ తిథి రెండు రోజులు ఉండటం వల్ల నవరాత్రి వేడుకల్లో ఒక రోజు పెరిగింది. భక్తులు ఈ 10 రోజుల పాటు అమ్మవారిని ఆరాధించవచ్చని, తద్వారా శక్తి, అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. ఈ పవిత్రమైన రోజుల్లో ఉపవాసం పాటిస్తూ.. దుర్గాదేవిని పూజిస్తే కోరికలు నెరవేరుతాయని సూచిస్తున్నారు.