News June 6, 2024
పార్టీలు చీల్చిన వారికి ఓటర్ల షాక్!
మహారాష్ట్రలో పార్టీలను చీల్చిన వారికి ప్రజలు లోక్సభ ఎన్నికల్లో షాక్ ఇచ్చారు. తన బాబాయి శరద్ పవార్ నుంచి NCPని దక్కించుకున్న అజిత్ పవార్ పార్టీ 4చోట్ల పోటీ చేస్తే ఒకచోట మాత్రమే నెగ్గింది. అటు శరద్ పవార్ సారథ్యంలోని NCP 10 చోట్ల పోటీ చేయగా 8 గెలిచింది. మరోవైపు శివసేన విషయంలోనూ ఇలాంటి ఫలితాలే వచ్చాయి. పార్టీని చీల్చిన ఏక్నాథ్ శిండే వర్గం 7చోట్ల గెలిస్తే ఉద్ధవ్ ఠాక్రే వర్గం 9MP సీట్లు గెలుచుకుంది.
Similar News
News November 28, 2024
6,213 ప్రభుత్వ స్కూళ్లు మూతపడే దుస్థితి తీసుకొచ్చారు: హరీశ్ రావు
TG: రేవంత్ సర్కారు ఒక్క ఏడాదిలోనే 6,213 ప్రభుత్వ స్కూళ్లు మూత పడే దుస్థితి తీసుకొచ్చిందని హరీశ్ రావు విమర్శించారు. ప్రతీ చిన్న గ్రామానికి స్కూల్ ఏర్పాటు చేస్తామని ప్రగల్భాలు పలికారని అన్నారు. ‘జీరో స్కూల్ పేరిట 1,899 స్కూళ్లు, 10 మందిలోపు విద్యార్థులున్న 4,314 స్కూళ్లను శాశ్వతంగా మూసివేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే ఆ స్కూళ్లలో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తోంది’ అని Xలో ఆరోపించారు.
News November 28, 2024
డిసెంబర్ 1 నుంచి మరో హామీ అమలు: టీడీపీ
AP: ఎన్నికల సమయంలో ఇచ్చిన మరో హామీని కూటమి ప్రభుత్వం డిసెంబర్ 1 నుంచి అమలు చేయబోతున్నట్లు టీడీపీ ప్రకటించింది. ‘వరుసగా 2 నెలలు పింఛన్ తీసుకోకపోయినా మూడో నెల ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చు. జగన్ హయాంలో రద్దు చేసిన ఈ వెసులుబాటును తిరిగి కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే పింఛనుదారు మరణిస్తే అతని భార్యకు మరుసటి నెల నుంచే పింఛన్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు’ అని పేర్కొంది.
News November 28, 2024
KTRకు సీతక్క సవాల్
TG: దిలావర్పూర్లో 2022లోనే ఇథనాల్ ఫ్యాక్టరీకి KTR పర్మిషన్ ఇచ్చారని మంత్రి సీతక్క తెలిపారు. మంత్రిగా ఉండి గ్రామసభ నిర్వహించకుండా అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. దీనికి బీజేపీ కూడా మద్దతు తెలిపిందన్నారు. ఆ కంపెనీకి డైరెక్టర్లుగా తలసాని కొడుకు, తలసాని వియ్యంకుడు పుట్టా సుధాకర్ కొడుకు ఉన్నారన్నారు. KTRకు చిత్తశుద్ధి ఉంటే దిలావర్పూర్ రావాలని, ఎవరు పర్మిషన్ ఇచ్చారో తేలుద్దామని సవాల్ విసిరారు.