News May 12, 2024
‘మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు’
AP: రాష్ట్రంలో ఓటుకు నోటు పంపిణీ చేస్తూ రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో నోటుకు ఓటు వేసే ప్రసక్తే లేదంటూ కాకినాడలో ఓ కుటుంబం ఆదర్శంగా నిలుస్తోంది. ఇంటి ముందు ‘మా ఇంట్లో 6 ఓట్లు అమ్మబడవు’ అంటూ బోర్డు ఏర్పాటు చేసింది. ఓటు విలువను తెలియజేస్తూ వారు చేసిన పని చుట్టుపక్కల వారిని ఆలోచింపజేస్తోంది.
Similar News
News January 10, 2025
విడాకుల ప్రచారంపై స్పందించిన చాహల్
భార్య ధనశ్రీతో విడిపోతున్నట్లుగా వస్తున్న వదంతులపై భారత క్రికెటర్ చాహల్ స్పందించారు. ఈమేరకు అభిమానులకు ఇన్స్టాలో ఓ లేఖ రాశారు. ‘నాకు ఇస్తున్న మద్దతుకు నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీ మద్దతుతోనే ఇంతటివాడ్ని అయ్యాను. ఇంకా చాలా ప్రయాణం మిగిలే ఉంది. నా వ్యక్తిగత జీవితంపై ఆసక్తిని అర్థం చేసుకోగలను. కానీ దయచేసి ఆ విషయంలో సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేయొద్దు’ అని కోరారు.
News January 9, 2025
అందుకే బీర్ల తయారీని నిలిపేస్తున్నాం: UBL
TG: రాష్ట్రంలో బీర్ల తయారీని నిలిపేయడానికి గల కారణాలపై యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ మరోసారి వివరణ ఇచ్చింది. ‘బీరు తయారీ ముడిసరకు ధరలు పెరిగాయి. బీరు ధరలో తయారీ రేటు 16 శాతం కాగా ప్రభుత్వ పన్నులు 70 శాతం ఉంటాయి. మాకు సర్కారు నుంచి సకాలంలో <<15107893>>చెల్లింపులు<<>> జరగట్లేదు. నష్టాలు భరించలేక బీర్ల సరఫరా ఆపేస్తున్నాం’ అని పేర్కొంది.
News January 9, 2025
వైకుంఠ ఏకాదశికి సర్వాంగ సుందరంగా తిరుమల
AP: పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రేపటి నుంచి మొదలుకానున్న నేపథ్యంలో భూలోక వైకుంఠం తిరుమల సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. విద్యుత్కాంతుల ధగధగల మధ్య శ్రీవారి క్షేత్రం మెరిసిపోతోంది. స్వామివారి దర్శనం కోసం ఎదురుచూస్తున్న భక్తజన గోవింద నామ స్మరణతో ఏడుకొండలు మారుమోగుతున్నాయి. రేపు వైష్ణవ క్షేత్రాల్లో శ్రీమన్నారాయణుడి వైకుంఠ ద్వార దర్శనం ముక్తిని ప్రసాదిస్తుందనేది భక్తుల విశ్వాసం.