News March 25, 2024
2019లో జనసేనకు పోలైన ఓట్లు..2/4

➣పెందుర్తి: 19,626(9.79%, 2009 PRP అభ్యర్థి గెలుపు)
➣ఎలమంచిలి: 19,774(11.72%, 2009 PRP 30% ఓట్లు)
➣పి.గన్నవరం: 36,259(23.91%, 2009 PRP 30.74%)
➣రాజోలు: 50,053(32.92% ఓట్లతో జనసేన గెలుపు)
➣తాడేపల్లిగూడెం: 36,197(21.58%, 3వ స్థానం, 2009 PRP గెలుపు)
➣భీమవరం: 62,285(32.88%,2వ స్థానం, 2009 PRP 26.42%)
Similar News
News January 15, 2026
ఎల్లుండి నుంచి స్కూళ్లు.. శనివారమూ హాలిడే ఇవ్వాలని రిక్వెస్టులు

TG: ప్రభుత్వ జీవో ప్రకారం స్కూళ్లకు రేపటితో సంక్రాంతి సెలవులు ముగియనున్నాయి. శనివారం (17) నుంచి తిరిగి తెరుచుకోనున్నాయి. అయితే కనుమ జరిగిన నెక్స్ట్ రోజే సొంతూళ్ల నుంచి ఎలా రాగలమని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. శనివారమూ హాలిడే ఇస్తే ఎలాగూ ఆదివారం సెలవు కాబట్టి సోమవారం ఫ్రెష్‌గా పిల్లలను పంపొచ్చంటున్నారు. మరి మీ పిల్లలను ఎప్పటి నుంచి స్కూళ్లకు పంపుతారు? కామెంట్ చేయండి.
News January 15, 2026
ఫ్లైట్ క్రాష్ కేసు.. AAIBకి FIP లీగల్ నోటీసులు

గతేడాది JUNEలో జరిగిన అహ్మదాబాద్ ఫ్లైట్ ప్రమాదంలో ఆ విమాన పైలట్ సుమిత్ సభర్వాల్ కూడా చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని సుమిత్ మేనల్లుడు, కెప్టెన్ వరుణ్‌కు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) నోటీసులిచ్చింది. దీనిని పైలట్స్ ఫెడరేషన్(FIP) తప్పుపట్టింది. కేసుతో సంబంధం లేని వ్యక్తిని విచారణకు పిలిచారని, ఇది వేధింపులతో సమానం అంటూ AAIBకి లీగల్ నోటీసులు పంపింది.
News January 15, 2026
BMCలో బీజేపీదే హవా.. ఎగ్జిట్ పోల్స్ అంచనా

ముంబై మున్సిపల్ (BMC) ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. బీజేపీ, ఏక్నాథ్ షిండేకు చెందిన శివసేనకు 131-151 సీట్లు వస్తాయని యాక్సిస్ మై ఇండియా వెల్లడించింది. ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల కూటమి 58-68, కాంగ్రెస్ 12-16 వార్డులు గెలుచుకుంటాయని పేర్కొంది. కాగా BMCలో మొత్తం 227 వార్డులకు ఇవాళ ఎన్నికలు జరగ్గా, రేపు ఫలితాలు రానున్నాయి.


