News September 3, 2025
2 చోట్ల ఓట్లు.. కాంగ్రెస్ లీడర్‌కు EC నోటీస్

రూల్స్‌కు విరుద్ధంగా 2 నియోజకవర్గాల్లో ఓట్లు కలిగి ఉన్నారని కాంగ్రెస్ లీడర్ పవన్ ఖేరాకు ఢిల్లీ ఎన్నికల సంఘం నోటీస్ ఇచ్చింది. ఈనెల 8లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామంది. దీనిపై ఖేరా ఫైరయ్యారు. ‘ఓట్ చోరీపై మా ఫిర్యాదులను పట్టించుకోని EC విపక్ష నాయకులపై విరుచుకుపడుతోంది. అధికార పార్టీకి మద్దతిస్తున్నట్లు మరోసారి రుజువైంది. మహాదేవపురలో లక్ష ఫేక్ ఓట్లున్నా నోటీస్ ఎందుకివ్వలేదు?’ అని ప్రశ్నించారు.
Similar News
News September 21, 2025
H1B వీసా సమస్యను వెంటనే పరిష్కరించాలి: CM రేవంత్

TG: H1B వీసాపై ట్రంప్ ఆదేశాలు దిగ్భ్రాంతికి గురిచేశాయని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చారిత్రక ఇండో-అమెరికన్ సత్సంబంధాల్లో ఇది ఏమాత్రం ఆమోదయోగ్యమైన నిర్ణయం కాదన్నారు. దీని వల్ల తెలుగు టెకీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. సమస్యను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ప్రధాని మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ను కోరుతూ రేవంత్ ట్వీట్ చేశారు.
News September 20, 2025
కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తా: పవన్

AP: కోనసీమలో సముద్రపు నీరు చేరి పాడైన కొబ్బరి తోటలను స్వయంగా పరిశీలిస్తానని Dy.CM పవన్ కళ్యాణ్ తెలిపారు. ‘శంకరగుప్తం మేజర్ డ్రయిన్ వెంబడి ఉన్న గ్రామాల్లో కొబ్బరి తోటలు దెబ్బతిన్న విషయం నా దృష్టికి వచ్చింది. కేశనపల్లి, కరవాక, గొల్లపాలెం, గోగన్నమఠం, శంకరగుప్తం.. ఇలా 13 గ్రామాల రైతులు నష్టపోతున్నామని తెలిపారు. దసరా తర్వాత అక్కడికి వెళ్లి రైతాంగాన్ని కలిసి, తోటలు పరిశీలిస్తా’ అని ట్వీట్ చేశారు.
News September 20, 2025
రేపటి నుంచే సెలవులు.. హైవేపై రద్దీ

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 22 నుంచి దసరా సెలవులు మొదలవనుండగా ఆదివారం కలిసి రావడంతో రేపటి నుంచే హాలిడేస్ ప్రారంభం కానున్నాయి. దీంతో HYD-విజయవాడ హైవే వాహనాల రాకపోకలతో కిటకిటలాడుతోంది. HYD నుంచి ఆంధ్రాకు, ఆంధ్రా నుంచి HYDకు రాకపోకలు సాగించేవారితో టోల్‌ప్లాజాల వద్ద రద్దీ నెలకొంది. ఇక ఏపీలో వచ్చేనెల 3న, టీజీలో 4న స్కూళ్లు రీఓపెన్ కానున్నాయి. అప్పటివరకు విద్యార్థులు సెలవులు ఎంజాయ్ చేయనున్నారు.