News April 28, 2024
చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపినట్లే: సీఎం

AP: చంద్రబాబుకు పొరపాటున ఓటేస్తే పథకాలను ఆపేస్తారని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. ‘చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖిని నిద్రలేపినట్లే. పేదల ఆత్మగౌరవాన్ని పెంచేలా మంచి పాలన అందించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పదవుల్లో ప్రాధాన్యమిచ్చాం. పేద విద్యార్థులు ఇంగ్లిషులో అనర్గళంగా మాట్లాడేలా విద్యను అందిస్తున్నాం. 2లక్షల 30వేల ఉద్యోగాలు ఇచ్చాం. ఇంత మంచి చేసిన మీ బిడ్డను మళ్లీ ఆదరించాలి’ అని కోరారు.
Similar News
News October 18, 2025
అలసత్వం వద్దు.. అధికారులకు సీఎం వార్నింగ్

TG: ప్రభుత్వ స్కీముల అమలులో అలసత్వం వహిస్తే సహించేది లేదని అధికారులను CM రేవంత్ హెచ్చరించారు. CMO కార్యదర్శులు, CSతో సమావేశమయ్యారు. కొందరు అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు. అన్ని విభాగాల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని, పనుల పురోగతిని సమీక్షించాలి. ఫైళ్లు, పనులు ఆగిపోవడానికి వీల్లేదు’ అని స్పష్టం చేశారు.
News October 18, 2025
RTC బస్సులు స్టార్ట్ అయ్యాయ్!

తెలంగాణలో బంద్ ప్రభావం తగ్గడంతో ఆర్టీసీ బస్సులు డిపోల నుంచి బయటకు వస్తున్నాయి. హైదరాబాద్లో పలు ఎలక్ట్రిక్ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. జిల్లాల్లో 2,600 బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఉదయం నుంచే వివిధ బీసీ సంఘాలు, రాజకీయ నేతలు డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరి మీ ప్రాంతంలో బంద్ ప్రభావం ఎలా ఉందో కామెంట్ చేయండి.
News October 18, 2025
కెప్టెన్సీ కోల్పోతాననే భయం ఉంది: సూర్య

కెప్టెన్సీ కోల్పోతాననే భయం తనలో ఉందని IND T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వెల్లడించారు. T20లకూ గిల్ను కెప్టెన్ చేస్తారన్న ఊహాగానాలపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘నేను అబద్ధం చెప్పను. భయం ఉంటుంది. అదే నాకు మోటివేషన్. హార్డ్వర్క్ చేస్తూ నిజాయతీగా ఉంటే మిగతావన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. టెస్ట్, వన్డేలకు గిల్ కెప్టెన్ అవడం పట్ల హ్యాపీగా ఉన్నా. మా మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది’ అని పేర్కొన్నారు.