News April 7, 2024
లబ్ధి పొంది ఇతరులకు ఓటేస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లే: MLA

కర్ణాటక ఎమ్మెల్యే రాజు కాగే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘గ్యారంటీ స్కీం పొందిన వారు ఇతరులకు ఓటు వేస్తే రాజ్యాంగాన్ని అవమానించినట్లే, ప్రజాస్వామ్యాన్ని ఊచకోత కోసినట్లే..’ అని ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానించారు. పదేళ్లలో ప్రధాని మోదీ పేదలు, రైతుల గురించి నోరు విప్పలేదని, బీజేపీకి ఓటు వేయొద్దని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


