News May 12, 2024

ఆ దేశంలో ఓటు వేయడం తప్పనిసరి!

image

బెల్జియంలోనే కాకుండా అర్జెంటీనాలోనూ పౌరులు ఓటు వేయడం తప్పనిసరి. అక్కడ 112 ఏళ్ల నుంచి ఈ చట్టం అమల్లో ఉంది. 18-70 ఏళ్ల వారు కచ్చితంగా పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందే. ఉల్లంఘిస్తే అందుకు సరైన కారణాలు వెల్లడించాలి. లేదంటే 5-50 డాలర్ల ఫైన్ చెల్లించడం, మూడేళ్ల పాటు ప్రభుత్వ పదవుల్లో ఉండకుండా నిషేధం వంటి ఆంక్షలు ఉన్నాయి. అయితే పాలకుల నిర్లక్ష్యంతో ఈ నిబంధనలు అమలుకావడం లేదు.

Similar News

News November 3, 2025

పిల్లల్లో RSV ఇన్ఫెక్షన్

image

రెస్పిరేటరీ సిన్సిషియల్‌ వైరస్‌ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్‌ని బ్రాంకియోలైటిస్‌ అంటారు. ఇది ఏడాదిలోపు పిల్లల్లో ఎక్కువగా వస్తుంది. పెద్దలకూ రావొచ్చు. 3,4 రోజుల తర్వాత లక్షణాల తీవ్రత పెరుగుతుంది. దగ్గు, జలుబు, జ్వరంతో ఖంగుమని ఏకధాటిగా దగ్గుతుంటారు. కొంతమంది పిల్లల్లో ఆయాసం వచ్చి, ఆక్సిజన్‌ లెవెల్‌ తగ్గుతుంది. విపరీతమైన ఆయాసం ఉన్నా, ఫీడింగ్‌ సరిగా లేకపోయినా పిల్లల్ని హాస్పిటల్‌లో ఉంచే వైద్యం చేయాలి.

News November 3, 2025

KTR .. నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తావా: పొంగులేటి

image

TG: తన <<18177278>>ఇల్లు<<>> FTL పరిధిలో ఉందని నిరూపిస్తే తానే పడగొడతానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. లేకపోతే అప్పా జంక్షన్‌లో ముక్కు నేలకు రాస్తారా? అంటూ KTRకు ప్రతి సవాల్ చేశారు. లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. 500 రోజుల్లో అధికారంలోకి వస్తామన్న మాటల వెనుక BRS ఆలోచన ఏంటో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. గులాబీ నేతల కుట్రలు, కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

News November 3, 2025

RSV ఇన్ఫెక్షన్‌ను ఎలా నివారించాలంటే?

image

వర్షాకాలం, చలికాలంలో ఇన్‌ఫెక్షన్లు ప్రబలినప్పుడు గుంపులోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. బిడ్డను తీసుకొని ఫంక్షన్లకు వెళ్లకూడదు. దగ్గు, జలుబు ఉన్నవాళ్లకు తల్లిదండ్రులు, పిల్లలు దూరంగా ఉండాలి. సరైన ఇమ్యూనిటీ లేని పిల్లలకు RSV ఇమ్యూనోగ్లోబ్యులిన్‌ వ్యాక్సిన్‌ ఇస్తారు. పిల్లల్లో లక్షణాలు ఎక్కువగా ఉంటే వెంటనే నిర్లక్ష్యం చేయకుండా హాస్పిటల్‌కు తీసుకెళ్లాలి. పిల్లలకు పోషకాలున్న ఆహారం ఎక్కువగా ఇవ్వాలి.