News September 1, 2025

VRకు ఇద్దరు ఎస్ఐలు: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు ఎస్ఐలకు విఆర్‌కు పంపుతూ జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
దీనికి సంబంధించి ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్తూరు ఎస్సై ఆలీ మహమ్మద్, హిరమండలం ఎస్సై మహమ్మద్ యాసిన్‌లను విఆర్‌కు పంపారు. ఆయా పోలీస్ స్టేషన్‌లో పరిపాలన పరమైన అంశల్లో లోటుపాట్లు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపారు.

Similar News

News September 3, 2025

ఎచ్చెర్ల: కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ పోస్టులకు 9న వాక్ ఇంటర్వ్యూలు

image

అంబేడ్కర్ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్, సైన్స్ కళాశాలలకు చెందిన వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్స్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు రిజిస్టర్ సుజాత బుధవారం పేర్కొన్నారు. ఈ నెల 9న యూనివర్సిటీలో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. సీఎస్ఈ, ఎంసీఏ కోర్సుల్లో 6, ఈసీఈలో 4, మెకానిక్‌లో రెండు, సివిల్‌లో 2, మైక్రోబయాలజీలో ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు.

News September 3, 2025

నిమజ్జనాల్లో డీజేలకు అనుమతులు లేవు: SP

image

శ్రీకాకుళం జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాల నిమర్జన వేడుకల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులను ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశించారు. నిమజ్జనానికి వెళ్లే మార్గంలో వాహనాల రాకపోకలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలు, నిమజ్జన ఊరేగింపుల్లో డీజేలను వినియోగించేందుకు అనుమతులు లేవన్నారు.

News September 3, 2025

చింతపండుకి గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న గిరిజనులు

image

శ్రీకాకుళంలోని ఏజెన్సీ ప్రాంతాలలో చింతపండు సేకరించే గిరిజనులు ఈ ఏడాది గిట్టుబాటు ధర లేక నష్టాల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. గిరిజన కార్పొరేషన్ నుంచి గిట్టుబాటు ధర లభించక దళారీల దోపిడీకి గురవుతున్నారు. ఈ ఏడాది ఏజెన్సీలో మంచు ఎక్కువగా కురవటంతో చింతపండు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీనికి తోడు గిట్టుబాటు ధర చెల్లించకపోవటంతో దళారీలకే చింతపండు తక్కువ ధరకు ఇచ్చేస్తున్నామని గిరిజనులు వాపోతున్నారు.