News December 1, 2024
రాష్ట్రంలో మళ్లీ VRO వ్యవస్థ?
TG: రాష్ట్రంలో మళ్లీ వీఆర్వో వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. గతంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎంపికైన VROలకు నేరుగా బాధ్యతలు అప్పగించి, మిగతా వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహించి తీసుకోనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3 వేల మంది VROలు ఉండగా, మరో 8 వేల మందిని రాత పరీక్ష ఆధారంగా నియమిస్తారని సమాచారం. 10,909 రెవెన్యూ గ్రామాలకు VROలను నియమిస్తారని తెలుస్తోంది.
Similar News
News December 1, 2024
‘పుష్ప-2’: ఒక్క టికెట్ రూ.1,200.. కరెక్టేనా?
‘పుష్ప-2’ ప్రీమియర్ టికెట్ ధరలను రూ.800 పెంచడంతో మల్టీప్లెక్సుల్లో ఒక్కో టికెట్ రూ.1,200, సింగిల్ స్క్రీన్లో రూ.1,000 అవుతోంది. ఒక్క షోకు ఇంత రేటా? అని ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. అభిమానులు మాత్రమే ప్రీమియర్స్ చూస్తారని, వాళ్లు యాక్సెప్ట్ చేయడం వల్లే ధరలు పెంచుతున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే సంక్రాంతికి సైతం టికెట్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనిపై మీ కామెంట్?
News December 1, 2024
పంచాయతీల్లో సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్?
TG: పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం పలు నిబంధనల్లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్, ఉప సర్పంచ్లకు ఉన్న జాయింట్ చెక్ పవర్ను గతంలోలాగా సర్పంచ్, కార్యదర్శికి ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే ఇద్దరు కన్నా ఎక్కువ మంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీకి అనుమతించనున్నట్లు తెలుస్తోంది. రెండు టర్మ్ల రిజర్వేషన్ విధానాన్ని, సర్పంచ్పై కలెక్టర్ వేటు వేసే అధికారాన్ని తొలగించనున్నట్లు సమాచారం.
News December 1, 2024
‘బూడిద’తో కాసుల వర్షం.. అందుకే పోటీ!
AP: జమ్మలమడుగు పరిధిలోని RTPPలో ఫ్లైయాష్(బూడిద) కోసం ఆదినారాయణరెడ్డి, జేసీ ప్రభాకర్ మధ్య <<14738601>>గొడవ<<>> చర్చనీయాంశంగా మారింది. పేరుకు బూడిదే అయినా ఇది రూ.కోట్లు కురిపించే కల్పవృక్షం. RTPPలో రోజూ 19వేల టన్నుల బూడిద ఉత్పత్తవుతుంది. దీన్ని ఉచితంగానే తీసుకెళ్లొచ్చు. సిమెంట్ కంపెనీలు, ఇటుకల ఫ్యాక్టరీల్లో వాడతారు. టన్ను బూడిద రూ.3,400కు చేరడంతో దాన్ని సొంతం చేసుకోవడానికి పోటీ పడుతున్నారు.