News March 3, 2025
VSKP.. మధురానగర్లో బంగారం చోరీ

విశాఖలోని మధురానగర్ రాధవ్ మాధవ్ టవర్స్లో దొంగలు పడ్డారు. ఇంటి యజమానికి కృష్ణ కాకినాడలో బంధువులు ఇంటికి వెళ్లారు. అయితే ఇంటి తాళాలు విరగ్గొట్టి ఉన్నాయని ఎదురిటివారు కృష్ణకు ఆదివారం ఫోన్ చేశారు. దీంతో వెంటనే బంధువులతో కలిసి వచ్చి చూడగా ఇంట్లో 23 తులాల బంగారు ఆభరణాలు, రూ.లక్ష నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News December 22, 2025
పోరాటానికి సిద్ధమైన విశాఖ ఉక్కు భూ నిర్వాసితులు

విశాఖ ఉక్కు భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 4న పాత గాజువాకలో భారీ భిక్షాటన కార్యక్రమం చేపట్టనున్నారు. సుమారు 8,500 మంది ఆర్-కార్డు దారులకు న్యాయం చేయాలని, మిగులు భూములను పంపిణీ చేయాలని నిర్వాసితుల జేఏసీ డిమాండ్ చేస్తోంది. భూమి ఇచ్చే వరకు నెలకు రూ.25,000 భృతి చెల్లించాలని కోరుతూ 64 గ్రామాల నిర్వాసితులు ఈ పోరాటంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
News December 22, 2025
విశాఖ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్

విశాఖ జిల్లా ప్రజలు ఇకపై భవనాలు, ఖాళీ స్థలాల సర్వే సర్టిఫికెట్ల కోసం జీవీఎంసీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. కమిషనర్ వినూత్న ఆలోచనతో రూపొందించిన ఆన్లైన్ విధానాన్ని మేయర్ పీలా శ్రీనివాసరావు, కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం ప్రారంభించారు. www.gvmc.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకుంటే వారం రోజుల్లోనే సర్టిఫికెట్ జారీ అవుతుంది.
News December 22, 2025
మా ఉద్యోగాలు అడ్డుకోవద్దు జగన్: విశాఖలో నిరుద్యోగుల ఆందోళన

జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యువజన, నిరుద్యోగ సంఘాలు ఇవాళ ధర్నా చేపట్టాయి. టీసీఎస్, గూగుల్ వంటి ఐటీ సంస్థలపై వైసీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ అడ్డుకుంటున్నారని నేతలు మండిపడ్డారు. ‘మా జాబ్స్ అడ్డుకోవద్దు జగన్’ అంటూ నినాదాలు చేశారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటే సహించబోమని తలసముద్రం సూర్యం, గిరిధర్ తదితర నేతలు హెచ్చరించారు.


