News August 20, 2024

VSKP: 24న జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు

image

విశాఖ జడ్పీ భవనంలో ఈనెల 24వ తేదీన ఒకటి నుంచి ఏడు వ‌ర‌కు స్థాయీ సంఘాల సమావేశాలను నిర్వహించనున్నట్లు సీఈవో ఎం.పోలినాయుడు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన సమావేశాలు ప్రారంభం అవుతాయని చెప్పారు. ఈ సమావేశాలకు అన్ని శాఖల అధికారులు హాజరు కావాలని ఆదేశించారు.

Similar News

News November 22, 2025

కంచరపాలెం రైతుబజారుకు ‘బాహుబలి’ క్యారెట్

image

కంచరపాలెం రైతు బజార్‌కు 880 గ్రాములు క్యారేట్‌ను ఓ మహిళ రైతు తీసుకొచ్చింది. ఈ క్యారేట్‌ను వినియోగదారులు, ప్రజలు అందరూ వింతగా చూస్తూ వారి సెల్ ఫోన్‌లో ఫోటోలు తీసుకున్నారు. అయితే రైతు బజార్‌లో కేజీ క్యారెట్ రూ.60 ఉండడంతో ఈ ఒక్క క్యారెట్ రూ.53 ధర పలికింది. అయితే గతంలో చాలాసార్లు కాయగూరలు ఇటువంటి పరిమాణంలో రావడం జరిగిందని అధికారులు తెలిపారు.

News November 22, 2025

విశాఖ: పసికందు హత్య కేసులో వీడని మిస్టరీ

image

తాటిచెట్లపాలెంలో పసికందును క్రూరంగా హత్య చేసి శరీర భాగాలను వేరు చేసి కాల్వలో పడేసిన విషయం పాఠకులకు విధితమే. కాగా ఇప్పటివరకు దీనికి సంబంధించి ఎటువంటి కీలక ఆధారాలు లభించలేదు. అంతేకాకుండా మృతురాలి తలభాగం కూడా ఇప్పటిదాకా లభ్యం కాలేదు. కొండపై ఎవరైనా అనుమానితులు సంచరిస్తున్నార అన్న అనుమానంతో డ్రోన్లతో నిఘా పెట్టారు. ఆరోజు రాత్రి నుంచి వేకువజాము వరకు ఆ రోడ్డులో ప్రయాణించిన వారిని విచారిస్తున్నారు.

News November 22, 2025

వేట నిషేధ సమయంలో రూ.20 వేల సాయం: గంటా

image

బతుకు తెరువు కోసం ప్రాణాలను పణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రభుత్వం ఆసరాగా ఉంటుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల తిమ్మాపురంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల ఉపాధికి ఇబ్బంది కలుగకుండా ఏడాదికి రూ.20 వేల చొప్పున 12,130 మందికి రూ.25 కోట్ల సాయాన్ని అందించామని తెలిపారు.