News February 25, 2026

VSR ఏవియేషన్స్‌తో హెరిటేజ్‌కు ఏం సంబంధం: లోకేశ్

image

AP: VSR ఏవియేషన్స్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి లావాదేవీలు లేవని మంత్రి లోకేశ్ స్పష్టంచేశారు. ‘2022లో హెరిటేజ్ ఫిన్‌లీజ్‌లో VSR సంస్థ ఫైనాన్స్ తీసుకుంది. ఆ రోజు మేము అధికారంలోకి వస్తామని, మా MP ఏవియేషన్ మంత్రి అవుతారని, అజిత్ పవార్ VSR హెలికాప్టర్‌లో ఎక్కుతారని కలగన్నామా? బాబాయ్‌ని హత్య చేసి మా చేతిలో కత్తి పెట్టారు. VSR ఏవియేషన్‌పై YCP ఆరోపణలూ అలాంటివే’ అని అసెంబ్లీ లాబీలో చిట్ చాట్‌లో మండిపడ్డారు.

Similar News

News April 12, 2026

హార్ముజ్‌లో టెన్షన్.. పాక్ ట్యాంకర్ యూటర్న్

image

హార్ముజ్ జలసంధి దగ్గర హైడ్రామా చోటుచేసుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలం కావడంతో 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు చివరి నిమిషంలో యూటర్న్ తీసుకున్నాయి. పాక్, ఇరాక్‌కు చెందిన ఈ నౌకలు ఒమన్ గల్ఫ్ నుంచి పర్షియన్ గల్ఫ్‌లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఇరాన్ దగ్గరకు రాగానే వెనక్కి వెళ్లాయి. నిజానికి పాక్, ఇరాక్ నౌకలకు తొలుత ఇరాన్ అనుమతి ఇచ్చింది. కానీ చర్చలు ఫెయిల్ కావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

News April 12, 2026

జులై 3 నుంచి అమర్‌నాథ్ యాత్ర

image

J&K అనంతనాగ్ జిల్లాలో గల అమర్‌నాథ్ యాత్ర జులై 3 నుంచి మొదలు కానుంది. 57 రోజుల పాటు జరిగే ఈ యాత్ర ఆగస్టు 28 న ముగియనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారు. శివుని ఆశీస్సులు కోరుతూ చేసే తొలి పూజను జూన్ 29న జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిర్వహిస్తామన్నారు. ఈనెల 15 నుంచి <<19607867>>రిజిస్ట్రేషన్<<>> చేసుకోవచ్చు. 3,882 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్షేత్ర యాత్రకు మూడేళ్లలోపు, 70 ఏళ్లు పైబడినవారిని అనుమతించరు.

News April 12, 2026

ఏపీ ఇంటర్ ఫలితాలపై UPDATE

image

AP: ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డ్ అప్‌డేట్ ఇచ్చింది. ఈ నెల 19 (ఆదివారం) లోపు ఫలితాలు విడుదల చేస్తామని Way2Newsతో చెప్పింది. ఇప్పటికే మూల్యాంకనం పూర్తి కాగా విడుదలకు ప్రాసెస్ కొనసాగుతోందని తెలిపింది. కాగా ఫిబ్రవరి 23 నుంచి మార్చి 24 వరకు జరిగిన ఈ పరీక్షలకు దాదాపు 10.50 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.