News January 24, 2025

అప్రూవర్‌గా VSR.. జగన్ డిస్ క్వాలిఫై: బీటెక్ రవి

image

AP: రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయ్ సాయి రెడ్డి అప్రూవర్‌గా మారడం ఖాయమని టీడీపీ నేత బీటెక్ రవి ట్వీట్ చేశారు. వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా డిస్ క్వాలిఫై అవుతారని జోస్యం చెప్పారు. పులివెందుల నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగడం ఖాయమన్నారు.

Similar News

News December 24, 2025

PHOTO: కొత్త సర్పంచులతో సీఎం రేవంత్

image

TG: ఇవాళ సొంత నియోజకవర్గం కొడంగల్‌లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి కొత్త సర్పంచుల ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. సర్పంచులను సన్మానించి, గ్రామాలను అభివృద్ధి బాటలో నడిపించాలని సూచించారు. ఈ సందర్భంగా వారితో రేవంత్ దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది.

News December 24, 2025

చైనా గుబులు: AI ఎక్కడ తిరగబడుతుందోనని ఆంక్షలు

image

AI రేసులో ముందున్నామని ప్రకటిస్తున్న చైనా లోలోపల మాత్రం ఈ అత్యాధునిక టెక్నాలజీ పట్ల ఆందోళనతో ఉన్నట్లు తెలుస్తోంది. స్వతంత్రంగా డేటాను విశ్లేషించి సమాధానాలిస్తున్న చాట్‌బాట్‌లు ఎక్కడ తమ కమ్యూనిస్టు ప్రభుత్వ విధానాలపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తాయోనని కంగారు పడుతోందని రిపోర్ట్స్ చెబుతున్నాయి. AI మోడల్స్ ట్రైనింగ్‌ దశలోనే ప్రభుత్వ వ్యతిరేక డేటాపై జాగ్రత్తలు తీసుకునేలా మార్గదర్శకాలు జారీ చేసింది.

News December 24, 2025

రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్ రావు ధ్వజం

image

TG: వాదనలో విఫలమై, నిజాలు చెప్పే దమ్ము లేనప్పుడు వ్యక్తిగత దూషణలు మాత్రమే ఉంటాయంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. రేవంత్ రాక్షస భాషను, చిల్లర చేష్టలను, వెకిలి వేషాలను తెలంగాణ సమాజం సునిశితంగా గమనిస్తోందని తెలిపారు. అహంకారం తలకెక్కి ఉన్మాదిలా ప్రవర్తిస్తున్న ఆయనను ప్రజలు క్షమించరని, 2028 ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హరీశ్ ఫైర్ అయ్యారు.