News April 10, 2025
VSUలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీపై అవగాహన

నెల్లూరులోని విక్రమ సింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో బుధవారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ కె. సునీత ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. నూతన విద్యా విధానం విద్యార్థుల సమగ్ర విద్యాభివృద్ధికి దోహదపడేలా రూపొందించారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్ఈపీ-2020 కోఆర్డినేటర్ మధుమతి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 10, 2025
జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు మాతృవియోగం

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మాతృమూర్తి కోడూరు సరస్వతమ్మ గత రాత్రి మృతి చెందారు. దివంగత కోడూరు అయ్యప్ప రెడ్డి సతీమణి వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అత్త గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాలాజీ నగర్లో అంతిమయాత్ర సాగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News November 10, 2025
జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 77 ప్రత్యేక బృందాలతో హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని సంతపేట పరిధిలోని ఓ లాడ్జ్‌లో ఆకస్మిక తనిఖీ చేయగా, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 6 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి లాడ్జిలు, హోటల్స్‌ను ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు.
News November 9, 2025
కోవూరులో స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి

స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి చెందిన ఘటన కోవూరులో చోటుచేసుకుంది. కోవూరు గ్రామంలోని లక్ష్మీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి స్లాబ్ పనులను కార్పెంటర్ పట్నం ప్రసాద్ (48) చేస్తుండగా ప్రమాదవశాత్తు స్లాబ్ కూలి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


