News June 20, 2024

భారత హెడ్ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్?

image

జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా తాత్కాలిక హెడ్ కోచ్‌గా VVS లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జరిగే శ్రీలంక టూర్‌లో గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్‌గా ఛార్జ్ తీసుకోనున్నట్లు సమాచారం. దీనిపై BCCI నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జింబాబ్వే టూర్‌కు IPL స్టార్లు సెలక్ట్ కానున్నట్లు టాక్. అభిషేక్, నితీశ్, పరాగ్, మయాంక్, యశ్ దయాల్, హర్షిత్ రాణాకు జట్టులో చోటు ఖాయమైనట్లు తెలుస్తోంది.

Similar News

News October 8, 2024

బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్

image

AP: పిఠాపురంలో <<14301232>>మైనర్<<>> బాలికపై జరిగిన అఘాయిత్యం తనకు బాధ కలిగించిందని పవన్ కళ్యాణ్ అన్నారు. స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారని, లేదంటే తప్పించుకునేవాడని తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించానన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

News October 8, 2024

త్వరలో గ్రామబాట కార్యక్రమం: పెద్దిరెడ్డి

image

AP: వైసీపీ ఆధ్వర్యంలో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ బాట కార్యక్రమం చేపడతామని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా నాయకులతో తిరుపతిలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. పార్టీ కోసం శ్రమిస్తున్న వారికి పదవులు ఇస్తామని తెలిపారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం, మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు సమావేశానికి హాజరయ్యారు.

News October 8, 2024

తాజ్‌మహల్ అందం.. మాటల్లో చెప్పలేం: ముయిజ్జు

image

భారత పర్యటనలో ఉన్న మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు తాజాగా తాజ్‌మహల్‌ను సతీసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆ కట్టడం అందానికి ముగ్ధుడయ్యారు. ‘ఈ సమాధి మందిర అందాన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. ప్రేమకు, నిర్మాణ నైపుణ్య పరాకాష్ఠకు ఇది సజీవ సాక్ష్యం’ అని విజిటర్ బుక్‌లో రాశారు. భారత్‌లో 4 రోజుల టూర్‌లో భాగంగా ఆయన నేడు ముంబై, రేపు బెంగళూరులో పర్యటించనున్నారు.