News January 16, 2025
VZM:రహదారి నిబంధనలను పాటించాలి:కలెక్టర్
రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతీఒక్కరూ నిబంధనలను పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోరారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను కలెక్టర్ తమ ఛాంబర్‌లో గురువారం ప్రారంభించారు. దీనికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. అజాగ్రత్తగా వాహనాన్ని నడపడం వల్లే 90 శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని, నిబంధనలను పాటించడం ద్వారా వీటిని నివారించవచ్చున్నారు.
Similar News
News February 5, 2025
ఈ నెల 8న కొత్తవలసకు మాజీ ఉపరాష్ట్రపతి
కొత్తవలస మండలంలోని చింతలపాలెంలో ఈ నెల 8న మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినం పురష్కరించుకుని చిట్టిపాప తీర్ధ మహోత్సవం సందర్భంగా జరగనున్న సాహిత్యగోష్టికి వెంకయ్యనాయుడు హాజరవుతారని సర్పంచ్ సీతారామపాత్రుడు మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకిస్తారని చెప్పారు.
News February 4, 2025
విశాఖలోని విజయనగరం వాసి ఆత్మహత్య
విశాఖలోని విజయనగరం వాసి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం జరిగింది. మృతుడు విజయనగరం జిల్లా తెర్లాం మండలం పనుకువలస గ్రామానికి చెందిన అలుగుబెల్లి గణేశ్ (43)గా పోలీసులు గుర్తించారు. విశాఖలో పెయింటర్‌గా పనిచేస్తున్న గణేశ్ మిథిలాపురిలోని ఉడాకాలనీలో 9 నెలలుగా ఉంటున్నాడు. కాగా మంగళవారం ఉదయం హాల్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని మృతిచెందినట్లు పీఎంపాలెం పోలీసులు తెలిపారు.
News February 4, 2025
విజయనగరం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నిక హీట్
జిల్లాలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక హీట్ పెరిగింది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు స్పీడ్ పెంచారు. వివిధ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ మద్దతు కోరుతున్నారు. కాగా జిల్లాలో మొత్తం 4,937 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా వారిలో 3,100 మంది పురుష ఓటర్లు, 1,837 మంది మహిళ ఓటర్లు ఉన్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుండగా, వచ్చే నెల 3న ఓట్ల లెక్కింపు ఉంటుంది.