News April 25, 2024
VZM: అంధ పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

విజయనగరంలోని పూల్ బాగ్ లో ఉన్న ప్రభుత్వ అంధుల ఆశ్రమ పాఠశాలలో ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రధానాచార్యుడు మహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 38 సీట్లు ఉన్నాయన్నారు. 40 శాతం అంధత్వం కలిగిన 6 నుంచి 14 ఏళ్లలోపు బాల, బాలికలు అర్హులన్నారు. ఉచిత వసతి, పౌష్టికాహారం, ఆధునిక బ్రెయిలీ సామగ్రితో ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు.
Similar News
News November 17, 2025
రేగిడి ఆమదాలవలస: నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం నాగావళి నదిలో చేపల వేటకు వెళ్లి అనంతరం స్నానానికి దిగి గల్లంతైన లక్ష్మణరావు(55) గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టిన లభించలేదు. ఇవాళ డెడ్ బాడీ ఖండ్యాం నదిలో గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఇద్దరు, కుమార్తెలు ఉన్నారు.

VZM: మహిళపై హత్యాయత్నం..నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష

ఓ మహిళపై రాయితో దాడి చేసి, డబ్బులు దోచుకున్న కేసులో నిందితుడికి 6 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు నేడు తీర్పు వెల్లడించింది. SP దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం బొగ్గులదిబ్బలోని మహిళపై ఫూల్బాగ్ కాలనీకి చెందిన అమర్నాథ్ హత్యాయత్నం చేసి, నగదు దోచుకొని పారిపోయాడు. దీనిపై 1వ పట్టణ PSలో 2024లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్షను ఖరారు చేసింది.