News January 30, 2025

VZM: అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం

image

పంచాయితీరాజ్ ఇంజ‌నీర్లు, ఉపాధిహామీ ఏపిఎంలు, APDలు త‌మ ప‌నితీరును మెరుగుప‌ర్చుకోక‌పోతే స‌స్పెష‌న్ వేటు వేస్తామ‌ని క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ అంబేడ్కర్ హెచ్చ‌రించారు. క‌లెక్ట‌రేట్‌లో బుధ‌వారం నిర్వహించిన స‌మీక్షలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు హెచ్చిరిక‌ల‌కే ప‌రిమితం అయ్యామ‌ని, ఇక‌నుంచి చ‌ర్య‌లు మొద‌లు పెడుతున్నామ‌ని ప్ర‌క‌టించారు.

Similar News

News September 17, 2025

గంట్యాడ: చికిత్స పొందుతూ మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ మంగళవారం మృతి చెందింది. భీమవరం గ్రామానికి చెందిన అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి ఈనెల 12న రాత్రి గంట్యాడ మండలం కొండతామరపల్లి జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను జిల్లా కేంద్రాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News September 16, 2025

సీఎం సమీక్షలో విజయనగరం జిల్లా నూతన రథసారథులు

image

రాష్ట్రంలో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మంగళవారం నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో జిల్లా నూతన కలెక్టర్ ఎస్.రామ సుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన వివిధ కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

News September 16, 2025

పేద‌రిక నిర్మూల‌నే పీ-4 ల‌క్ష్యం: VZM జేసీ

image

పేద‌రిక నిర్మూల‌నే పీ-4 కార్య‌క్ర‌మం ప్ర‌ధాన‌ ల‌క్ష్య‌మ‌ని జేసీ ఎస్‌.సేతు మాధ‌వ‌న్‌ స్ప‌ష్టం చేశారు. మార్గ‌ద‌ర్శులు బంగారు కుటుంబాల‌ను ద‌త్త‌త తీసుకొని, వారిని పేద‌రికం నుంచి బ‌య‌ట‌కు తీసుకొచ్చే విధంగా కృషి చేయాల‌ని కోరారు. పీ-4 కార్య‌క్ర‌మం, బంగారు కుటుంబాలు, మార్గ‌ద‌ర్శుల పాత్ర‌పై స‌చివాల‌యం నుంచి ఎంపిక చేసిన ఎంవోటీ, టీవోటీలకు క‌లెక్ట‌రేట్లో మంగ‌ళ‌వారం శిక్ష‌ణా కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.