News October 17, 2024
VZM: అధికార యంత్రాంగానికి మంత్రి కీలక ఆదేశాలు

గుర్లలో డయేరియా బాధితులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గురువారం పరామర్శించారు. తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతున్న నీటి నాణ్యతపై రిపోర్టులు సేకరించాలని మంత్రి ఆదేశించారు. ఈ నివేదికలన్నీ సమగ్రంగా విశ్లేషించిన తర్వాత నీరు కలుషితం కావడానికి కారణాలపై ఒక అంచనాకు రావాలని చెప్పారు. అప్పటివరకు గ్రామస్థులకు ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారానే నీటిని సరఫరా చేయాలన్నారు.
Similar News
News October 30, 2025
VZM: వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ అప్పన్న అరెస్ట్..!

TTDలో కల్తీ నెయ్యి వ్యవహారం కేసులో మాజీ TTD ఛైర్మన్ YV.సుబ్బారెడ్డి మాజీ PA అప్పన్నను నిన్న రాత్రి సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. బ్లాక్ లిస్ట్లో ఉన్న బోలెబాబా డెయిరీ వేరొక డెయిరీని ముందు పెట్టి.. కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ విషయం తెలిసినా కమీషన్ల కోసం అంతా సైలెంట్ అయ్యారనే ఆరోపణలపై సిట్ విచారణ సాగిస్తుంది. ఈ క్రమంలో VZM (D) తెర్లాం (M)కి చెందిన అప్పన్నను అరెస్ట్ చేశారు.
News October 30, 2025
VZM: జిల్లా కలెక్టర్, యంత్రాంగాన్ని అభినందించిన సీఎం చంద్రబాబు

మొంథా తుఫాన్ సమయంలో సమయస్ఫూర్తితో, సమన్వయంతో వ్యవహరించి ప్రాణ నష్టం లేకుండా చర్యలు తీసుకున్నందుకు జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి, జిల్లా యంత్రాంగాన్ని సీఎం చంద్రబాబు బుధవారం నిర్వహించిన వీసీలో అభినందించారు. తుఫాన్ సమయంలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది చూపిన అంకితభావాన్ని సీఎం ప్రశంసించారు. కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం అభినందనలకు ధన్యవాదాలు తెలిపారు.
News October 29, 2025
VZM: ‘రేపటి నుంచి యథావిధిగా పాఠశాలలు’

మొంథా తుఫాన్ కారణంగా మూడు రోజులుగా మూసివేసిన పాఠశాలలను రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) మాణిక్యాల నాయుడు ఆదేశించారు. తుఫాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో పాఠశాలలను పునఃప్రారంభించాలని మండల అధికారులు, హెచ్ఎంలకు సూచించారు. ఈ మేరకు విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


