News June 22, 2024

VZM: అన్నదాతలను ఊరిస్తున్న వర్షాలు

image

జిల్లాలో వర్షం కోసం అన్నదాతలు ఎదురుచూపులు చూస్తున్నారు. సాగు కోసం అన్ని సమకూర్చి సిద్ధంగా ఉన్నప్పటికీ అనుకూలమైన వర్షం పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఆర్బీకేల ద్వారా విత్తనాలు సరఫరా చేస్తున్న తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. గడిచిన నాలుగు రోజుల నుంచి 35- 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వర్షం కురిసిన తడి ఆవిరవుతుందని రైతులు వాపోతున్నారు.

Similar News

News November 4, 2024

విజయనగరం జిల్లాలో క్యాంపు రాజకీయాలు.?

image

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. వైసీపీకి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో క్యాంపు రాజకీయాలు తప్పనిసరి అంటూ వైసీపీ అధిష్ఠానం భావిస్తోన్నట్లు సమాచారం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక లాగే పోలింగ్ రోజు వరకు స్థానిక సంస్థల ఓటర్లను వివిధ ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.

News November 4, 2024

దీపావళితో రాష్ట్రంలో వెలుగులు నిండాయి: మంత్రి

image

అల్లూరి జిల్లాలో లక్షా యాభై వేల మంది లబ్ధిదారులకు దీపం పథకం ద్వారా ఉచితంగా మూడు గ్యాస్ సిలెండర్లు ఇస్తున్నట్లు మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పాడేరు మండలం, బంగారుమెట్ట గ్రామంలో దీపం-2.0 కార్యక్రమంలో మంత్రి పాల్గొని, లబ్ధిదారులకు గ్యాస్ సిలెండర్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. దీపావళితో రాష్ట్రంలో వెలుగులు నిండాయని అన్నారు.

News November 4, 2024

VZM: సంఖ్యాబలంలో వైసీపీనే టాప్..!

image

విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్న సంగతి తెలిసిందే. వైసీపీ పోటీలో నిలవడం దాదాపు ఖాయం కాగా కూటమి నుంచి ఇంకా ఎటువంటి సంకేతాలు రాలేదు. సంఖ్యాబలంలో టీడీపీ కంటే వైసీపీనే టాప్ ప్లేస్‌లో ఉంది. కూటమికి 169 మంది సభ్యుల బలం ఉండగా, వైసీపీకి 548 మంది సభ్యుల బలం ఉంది. ఇండిపెండెంట్లు మరో 14 మంది ఉన్నారు.