News June 7, 2024
VZM: అప్పుడు 7 వేలు ఓట్లు.. ఇప్పుడు 1,09,915

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన లోకం నాగ మాధవి కేవలం 7వేల ఓట్లకే పరిమితమయ్యారు. 2024లో టిక్కెట్ దక్కించుకున్న ఆమె.. తన చరిష్మాతో నియోజకవర్గమంతా తిరిగి ప్రజాభిమానాన్ని సంపాదించారు. ముఖ్యంగా పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి యువతను తన వైపు ఆకర్షించారు. ఫలితంగా 1,09,915 ఓట్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్నారు.
Similar News
News October 23, 2025
సహకార సంస్థలు తమ డేటాను అందించాలి: కలెక్టర్

జిల్లాలో ఉన్న సహకార సంస్థలు తమ డేటాను జిల్లా సహకార అధికారికి అందించాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. విజయనగరం కలెక్టరేట్లో కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కమిటీ సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. డేటాను నేషనల్ కో-ఆపరేటివ్ డేటా బేస్ పోర్టల్లోఅప్డేట్ చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో 19,500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం ఉన్న గోడౌన్ స్పేస్ అందుబాటులో ఉందని, వినియోగంలోకి తేవాలని సూచించారు.
News October 23, 2025
VZM: జిల్లాకు బాక్సింగ్‌లో 4 రాష్ట్ర స్థాయి మెడల్స్

రాజమండ్రిలో జరిగిన స్కూల్ గేమ్స్‌లో విజయనగరం జిల్లా బాక్సింగ్ క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-17 కేటగిరీలో దుర్గాప్రసాద్, సచిన్.. అండర్-19 కేటగిరీలో వర్ధన్ రెడ్డి, యశ్వంత్ బంగారు పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలో క్రీడాకారులు కలెక్టర్ రాం సుందర్ రెడ్డిని బుధవారం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చాటాలని కలెక్టర్ సూచించారు.
News October 23, 2025
అర్హులందరికీ ఇళ్లు మంజూరు: VZM కలెక్టర్

గృహాల లేఅవుట్లలో ఖాళీగా ఉన్న స్థలాలను గుర్తించి అర్హులైన వారికి కేటాయించేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని విజయనగరం కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం అమరావతి నుంచి CCLA ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫిరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. అందరికీ ఇళ్లు విధానంలో అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.