News June 7, 2024

VZM: అప్పుడు 7 వేలు ఓట్లు.. ఇప్పుడు 1,09,915

image

2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన లోకం నాగ మాధవి కేవలం 7వేల ఓట్లకే పరిమితమయ్యారు. 2024లో టిక్కెట్ దక్కించుకున్న ఆమె.. తన చరిష్మాతో నియోజకవర్గమంతా తిరిగి ప్రజాభిమానాన్ని సంపాదించారు. ముఖ్యంగా పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని స్పష్టమైన హామీ ఇచ్చి యువతను తన వైపు ఆకర్షించారు. ఫలితంగా 1,09,915 ఓట్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్నారు.

Similar News

News December 2, 2024

ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు: మంత్రి

image

రాష్ట్రంలోనే మొదటి <<14768413>>DSC ఫ్రీ కోచింగ్ సెంటర్‌<<>>ను పార్వతీపురంలో మొదలు పెట్టామని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సీతంపేట ఐటీడీఏలో కూడా కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మొత్తం 236 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో ST-144 SC-44,BC-42, ఐదుగురు ఓసీలు అప్లే చేసుకున్నారని వెల్లడించారు. ఇంకా ఎవరైనా ఆసక్తి గల వారు ఉంటే వారికి కూడా ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

News December 2, 2024

పార్వతీపురం: నేటి నుంచి ఉచిత డీఎస్సీ కోచింగ్ 

image

ఉచిత డీఎస్సీ కోచింగ్‌ను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురంలో ప్రారంభిస్తున్నట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు గిరిజన సామాజిక భవనంలో సెంటర్ ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.  కోచింగ్ రెండు నెలల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నామన్నారు.

News December 2, 2024

VZM: లీగల్ వాలంటీర్లుగా అవకాశం

image

జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో పారా లీగల్ వాలంటీర్లుగా పనిచేసేందుకు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని న్యాయసేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి TV రాజేశ్ కోరారు. పదోతరగతి చదివి తెలుగు చదవడం, రాయడం రావాలన్నారు. క్రిమినల్ కేసులు ఉండరాదని సూచించారు. శిక్షణ కాలంలో గాని, శిక్షణ పూర్తైన తరువాత గాని ఎటువంటి జీతభత్యాలు ఉండవన్నారు. కేవలం సమాజ సేవ దృక్పథం గల వారు దరఖాస్తులు చేసుకోవాలన్నారు.