News November 3, 2024
VZM: అభ్యర్థుల ఎంపికపై రకరకాల ఊహాగానాలు
విజయనగరం ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరనేదానిపై జిల్లాలో ప్రస్తుతం చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టీడీపీ తరఫున గొంప కృష్ణ, కిమిడి నాగార్జున పేర్లు వినిపిస్తుండగా.. వైసీపీ తరఫున కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాస్, బెల్లాన చంద్రశేఖర్ పేర్లు వినిపిస్తున్నాయి.
Similar News
News December 5, 2024
VZM: పండగ వాతావరణంలో మెగా పేరెంట్స్ డే
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 7న మెగా పేరెంట్, టీచర్స్ సమావేశాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ సమావేశాలు ప్రతీ ఒక్కరికీ ఒక మధుర స్మృతిలా మిగిలిపోవాలన్నారు. విద్యార్థుల్లో స్ఫూర్తిని రగల్చాలని, వారిలో సృజనాత్మకతను వెలికి తీసి, ప్రతిభకు పట్టం కట్టాలన్నారు.
News December 4, 2024
ఊపిరి పీల్చుకున్న విజయనగరం..!
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అలాంటి ఆనవాళ్లు ఎక్కడా కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విశాఖలో అక్కయ్యపాలెంతోపాటు పలు ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. కాగా.. గత సెప్టెంబర్‌లో బొబ్బిలి, పాచిపెంట, మక్కువ, సాలూరు తదితర ప్రాంతాల్లో భూమి కంపించగా..రిక్టర్ స్కేలు 3.4గా నమోదైంది.
News December 4, 2024
బొబ్బిలిలో రైలు ఢీకొని యువకుడి మృతి
బొబ్బిలి పట్టణంలో రైలు ఢీకొని ఓ యువకుడు మంగళవారం మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన యువకుడు బాడంగి మండలం భీమవరం గ్రామానికి చెందిన కొండేటి చంద్రశేఖర్‌గా గుర్తించారు. అయితే ప్రమాదవశాత్తూ జరిగిందా లేక ఆత్మహత్య చేసుకున్నాడా.. అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. రైల్వే ఎస్ఐ బాలాజీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.