News January 31, 2025
VZM: అమల్లోకి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్: కలెక్టర్

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ MLC ఎన్నిక కోసం ఈ నెల 29న షెడ్యూల్ వెలువడినందున ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ అంబేడ్కర్ గురువారం తెలిపారు. ఈ ఎన్నిక కోసం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారని, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అనకాపల్లి, ఏ.ఎస్.ఆర్ జిల్లాల డి.ఆర్.ఓ లు సహాయ రిటర్నింగ్ అధికారులుగా ఉంటారని తెలిపారు.
Similar News
News December 15, 2025
ఎస్.కోట సబ్ జైలును తనిఖీ చేసిన ప్రధాన న్యాయమూర్తి

ఎస్.కోట సబ్ జైలును జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత సోమవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీలకు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించి, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు. ఖైదీల పట్ల సిబ్బంది లేదా తోటి ఖైదీలు వివక్ష చూపరాదని, అలా జరిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఖైదీలను ఉద్దేశించి నేర ప్రవృత్తిని విడనాడి మంచి పౌరులుగా మారాలని హితవు పలికారు.
News December 15, 2025
VZM: ‘చిన్న పత్రికలకు చేయూత ఇవ్వాలి’

చిన్న, మధ్య తరహా పత్రికలకు మద్దతు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ రాం సుందర్ రెడ్డికి విలేకరుల బృందం సోమవారం వినతిపత్రం ఇచ్చారు. అక్రిడిటేషన్ సంఖ్య పెంపునకు ఇతర జిల్లాల నుంచి ప్రచురితమవుతున్న విజయనగరం జిల్లాలో పనిచేస్తున్న విలేకరులకు అక్రిడిటేషన్ మంజూరు చేయాలన్నారు. క్యాలెండర్ ప్రకటనల ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే అంశాలను వినతిలో ప్రస్తావించారు.
News December 14, 2025
VZM: ఎంపికైన కానిస్టేబుళ్లకు ముఖ్య గమనిక..

విజయనగరం జిల్లాలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన పురుష, మహిళా అభ్యర్థులు సోమవారం ఉదయం 5 గంటలకు జిల్లా పోలీసు కార్యాలయం వద్ద హాజరుకావాలని ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ సూచించారు. అభ్యర్థితో పాటు వారి తల్లిదండ్రులు, సమీప బంధువులు ఇద్దరు కలిపి మొత్తం ముగ్గురు హాజరుకావాలన్నారు. అభ్యర్థులు, కుటుంబసభ్యులకు పోలీసు శాఖ టిఫిన్, భోజన సదుపాయం కల్పిస్తుందని చెప్పారు. పురుష అభ్యర్థులు నీట్ షేవింగ్‌తో రావాలని సూచించారు.


