News September 24, 2024

VZM: అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి శ్రీనివాస్

image

శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా అక్టోబర్ 15న రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని ప్రభుత్వ పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Similar News

News October 16, 2024

గుర్లలో కోరలు చాచిన డయేరియా

image

విజయనగరం జిల్లా గుర్ల మండల కేంద్రంలో డయేరియా కోరలు చాచింది. రెండు రోజుల వ్యవధిలో ఐదుగురు మ్యత్యవాత పడ్డారు. బుధవారానికి డయేరియా కేసులు మరిన్ని పెరిగాయి. స్థానిక ఉన్నత పాఠశాలలో161 మందికి చికిత్స అందిస్తున్నారు. కలుషిత నీరు తాగడం వల్లే డయేరియా ప్రబలిందని బాధితులు చెబుతున్నారు. నెల్లిమర్ల సీహెచ్సీ, విజయనగరం పెద్ద ఆసుపత్రి, గోషాలో డయేరియా రోగులు చికిత్స పొందుతున్నారు.

News October 16, 2024

అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీలలో పైడిరాజుకు కాంస్య పతకం

image

సాలూరు మండలం మామిడిపల్లికి చెందిన కనకల పైడిరాజు ఈనెల 10 నుంచి 19 వరకు మలేషియాలో జరుగుతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో 800 మీటర్ల రన్నింగ్‌లో కాంస్య పతకం సాధించినట్లు ఆమె గురువు పొట్నూరు శ్రీరాములు తెలిపారు. 36వ మలేషియా ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో ఇండియా తరఫున పాల్గొన్న పైడిరాజు భారతదేశానికి 800 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం సాధించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.

News October 16, 2024

విజయనగరం డ్వాక్రా బజార్‌ను సందర్శించిన మన్యం జిల్లా కలెక్టర్

image

విజయనగరంలో ట్యాంక్ బండ్ సమీపంలో, DRDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజార్‌ను మన్యం జిల్లా కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన వివిధ రాష్ట్రాలు నుంచి వచ్చి అమ్మకాలు చేపడుతున్న మహిళా సంఘాలు సభ్యులతో మాట్లాడి ఆదాయం ఎంత వస్తుంది అనేది అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో, DRDA పీడీ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు.