News March 23, 2024
VZM: ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం ఇక్కడి నుంచే పోటీ చేశారు

ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి 1953లో ప్రాతినిధ్యం వహించి చట్టసభలకు వెళ్లారు. 1953లో సీవీ సోమయాజులు అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీఎస్పీ నుంచి టంగుటూరి ఏకగ్రీవంగా ఎన్నికై ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు.
Similar News
News October 22, 2025
VZM: ‘సర్దార్ @ 150 కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలి’

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన “సర్దార్ @150” కార్యక్రమాల్లో యువత చురుకుగా పాల్గొనాలని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. స్థానిక నెహ్రూ యువ కేంద్రంలో పోస్టర్లను ఆవిష్కరించారు. ఈనెల 31 నుంచి నవంబర్ 25వ తేదీ వరకు జరగనున్న ర్యాలీలు, పోటీల్లో విద్యార్థులు, యువత విరివిగా పాల్గొని పటేల్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలన్నారు.
News October 22, 2025
విజయనగరం ఉత్సవాలకు రూ.2.02 కోట్ల విరాళాలు: కలెక్టర్

విజయనగరం ఉత్సవాలకు 435 మంది దాతలు మొత్తం రూ.2.02 కోట్లు విరాళంగా అందించారని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి బుధవారం తెలిపారు. వాటిలో రూ.1.41 కోట్లు ఉత్సవాల నిర్వహణకు వినియోగించగా.. మిగిలిన రూ.61 లక్షలు వచ్చే ఏడాది ఉత్సవాలకు ఉంచినట్లు ఆయన వివరించారు. 12 వేదికలపై సాహిత్య, సంగీత, నృత్య కార్యక్రమాలు ఘనంగా నిర్వహించామని, ఉత్సవాల విజయానికి సహకరించిన దాతలకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
News October 22, 2025
ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వండి: కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. అధికారులతో బుధవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫిర్యాదులను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. ప్రీ-ఆడిట్ పెండింగ్ ఫిర్యాదులను రెండు వారాల్లో 20% లోపు తగ్గించాలని, SLA గడువు దాటకూడదని స్పష్టం చేశారు. ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసే శాతం 10% కంటే ఎక్కువ కాకుండా చూడాలని సూచించారు.