News March 11, 2025
VZM: ఆదర్శ దివ్యాంగ జంటలకు అభినందన

ఆదర్శ వివాహం చేసుకున్న దివ్యాంగ జంటలను ఇన్‌ఛార్జి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసమూర్తి సోమవారం ఆశీర్వదించారు. విజయదుర్గా దివ్యాంగుల సంక్షేమ సంఘం, హెల్పింగ్ హేండ్స్ హిజ్రాస్ సంస్థ సమక్షంలో రెండు విభిన్న ప్రతిభావంతుల జంటలకు వివాహం చేశాయి. జిల్లాకు చెందిన నారాయణ, శ్రీసత్య అలాగే సత్య ఆచారి, విజయలక్ష్మి ఆదర్శ వివాహం చేసుకున్నారు. ఈ రెండు జంటలను శ్రీనివాస్ మూర్తి అభినందించారు.
Similar News
News February 24, 2026
VZM: పెసలు, మినుములకు ప్రభుత్వ మద్దతు ధర ఇదే

రైతులకు మద్దతు ధర కల్పించేందుకు ఈనెల 27 నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు JC సేధు మాధవన్ సోమవారం తెలిపారు. తొలి దశలో జామి, సంతకవిటి, బొబ్బిలి మండలాల్లో కేంద్రాలు ప్రారంభిస్తామని, పెసలు క్వింటాకు రూ.8,768, మినుములు రూ.7,400 మద్దతు ధరగా ఉంటుందని, కొనుగోళ్లను ఏపీ మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా, ఎన్‌సీసీఎఫ్ ద్వారా నిర్వహిస్తారన్నారు. అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
News February 23, 2026
బోద నివారణ కార్యక్రమం విజయవంతం చేయాలి: VZM కలెక్టర్

జిల్లాలో బోద (ఫైలేరియా) నివారణ ప్రత్యేక కార్యక్రమాన్ని లక్ష్యానికి అనుగుణంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జాతీయ ఆరోగ్య మిషన్ అడిషనల్ సెక్రటరీ ఆరాధన పట్నాయక్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. గుర్ల మండలంలో ఇప్పటివరకు 5,516 మందికి డీఈసీ మాత్రలు పంపిణీ చేసినట్లు తెలిపారు. మిగిలిన 7,710 మందికి మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
News February 23, 2026
VZM: ఇంటర్ పరీక్షకు 862 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షను 20,430 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 19,568 మంది హాజరయ్యారని రీజనల్ ఇన్స్పెక్టర్ తవిటినాయుడు తెలిపారు. మొత్తం 862 మంది గైర్హాజరయ్యారన్నారు. జిల్లాలో 66 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 100 మంది ఇన్విజిలేటర్లు, 3 సిట్టింగ్ స్క్వాడ్లు, 3 ఫ్లైయింగ్ స్క్వాడ్లు నియమించారు. జిల్లాలో ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్ జరగలేదని ఆయన చెప్పారు.


