News June 25, 2024
VZM: ఆర్టీసీ ప్రత్యేక బస్ సర్వీసులు

విశాఖ – విజయవాడ మార్గంలో పలు రైళ్లను రద్దు చేయడంతో ఆర్టీటీ బస్సు సర్వీసులను నడపనున్నట్లు డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ అప్పలనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ద్వారక బస్ స్టేషన్ నుంచి 12 ప్రత్యేక సర్వీసులు, శ్రీకాకుళం విజయనగరం నుంచి మరో మూడు ప్రత్యేక సర్వీసులు విజయవాడకు నడుపుతామన్నారు. వందే భారత్ రైలు ప్రయాణికుల కోసం విశాఖ నుంచి విజయనగరానికి రాత్రి వేళల్లో ప్రత్యేక బస్ సర్వీసు ఏర్పాటు చేశామన్నారు.
Similar News
News November 7, 2025
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

గరివిడి మండలం చిన ఐతంవలస వద్ద శుక్రవారం ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో చీపురుపల్లి మండలం పెరుమాళికి చెందిన కొరగంజి శ్రీలత (48)మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. భర్త సంగం నాయుడుతో కలిసి స్కూటీపై చీపురుపల్లి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.ఈ దుర్ఘటనలో బస్సు ముందు చక్రం శ్రీలత తలపై నుంచి వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా నాయుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డాడు.
News November 7, 2025
VZM: కంచం చేత పట్టి లైన్లో నిల్చున్న కలెక్టర్

గంట్యాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఆయన పరిశీలించారు. అక్కడ విద్యార్థులకు బోధన చేయడమే కాకుండా వారితో పాటు కంచం పట్టుకుని లైన్లో నిల్చున్నారు. అనంతరం మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీశారు.
News November 7, 2025
VZM: సబ్సిడీ కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు

సఫాయి కర్మచారి యువతకు NSKFDC పథకం కింద సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలు సబ్సిడీపై మంజూరు చేయనున్నట్లు SC కార్పొరేషన్ ED వెంకటేశ్వరరావు తెలిపారు. జిల్లాకు కేటాయించిన మూడు వాహనాలకు కొత్త లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఐదుగురు సఫాయి కర్మచారులు కలిసి గ్రూపుగా దరఖాస్తు చేసుకోవాలని, వారిలో ఒకరికి హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని సూచించారు. జిల్లా కార్యాలయానికి దరఖాస్తులు సమర్పించాలన్నారు.


