News March 11, 2025
VZM: ఇంటర్ పరీక్షకు 1,012 మంది గైర్హాజరు

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మంగళవారం జరిగిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు ఫిజిక్స్, ఎకనామిక్స్, ఒకేషనల్ విద్యార్థులు 1,012 మంది గైర్హాజరు అయ్యారని ఆర్ఐఓ ఎం.ఆదినారాయణ తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా 22,398 మంది హాజరు కావాల్సి ఉండగా వారిలో 21,386 మంది మాత్రమే హాజరయ్యారని అన్నారు. విద్యార్థులు మాల్ ప్రాక్టీస్కి పాల్పడకుండా పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.
Similar News
News January 10, 2026
ఉపాధి పనులు ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలి: మంత్రి కొండపల్లి

విజయనగరం జిల్లాలో గ్రౌండింగ్ అయిన ఉపాధి హామీ పనులన్నింటినీ ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. తన కాంప్ కార్యాలయంలో ఉపాధి హామీ, పంచాయతీ రాజ్ అధికారులతో శనివారం సమీక్షించారు. స్మశానాలు లేని గ్రామాలు, SC కాలనీలకు స్మశానాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు, గోశాలల పనులు వేగవంతం చేసి బిల్లులు వెంటనే అప్లోడ్ చేయాలని సూచించారు.
News January 10, 2026
VZM: సంక్రాంతి సందడి.. కిక్కిరిసిన బస్సులు

సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో హాస్టల్స్లో ఉన్న విద్యార్థులు తమ సొంత ఊర్లకు పయనమయ్యారు. అదేవిధంగా ఇతర ప్రాంతాలకు కూలి పనుల నిమిత్తం వెళ్లిన వారు స్వగ్రామాలకు వస్తున్నారు. దీంతో రైళ్లు, బస్సులు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. ముఖ్యంగా VZM – VSKP రూట్లో రద్దీ ఎక్కువగా ఉంది. పండగ సందర్భంగా అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.
News January 10, 2026
VZM: పోలీసు కుటుంబాలతో సంక్రాంతి సంబరాలు

ఈనెల 13న జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో పోలీసు కుటుంబాలతో సంక్రాంతి వేడుకలు జరుపుకుంటున్నట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ముగ్గుల పోటీలు, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, భోగి మంటలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలీసు మహిళా ఉద్యోగినులు ప్రత్యేకంగా పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ, కన్సోలేషన్ బహుమతులు పొందవచ్చు అన్నారు. ఆరోజు ఉదయం 8 గంటలకు ముగ్గుల సామగ్రితో మైదానంలో హాజరు కావాలని ఎస్పీ ఆహ్వానించారు.


